Sunday, 6 February 2022

కుర్ర హీరోయిన్‌తో రవితేజ లిప్ లాక్.. లీకయిన ఫొటోలు

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా సినిమాలో కంటెంట్ మారుతుంది. ఒకప్ప‌టితో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో ఘాటు కంటెంట్ డోసు పెరిగింద‌న‌డంలో సందేహం లేదు. అలాగే ఇప్ప‌టి సినిమాల్లో హీరో హీరోయిన్స్ మ‌ధ్య రొమాన్స్ రేంజ్ కూడా కాస్త పెరిగింది. లిప్ లాక్స్ అనేవి కామ‌న్ అయ్యాయి. చాలా కొద్ది మంది హీరోలు మాత్ర‌మే లిప్ లాక్స్‌కు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో హీరో ర‌వితేజ ఒక‌రు. అయితే ఆయ‌న కూడా త‌న ఒట్టును తీసి గ‌ట్టు మీద పెట్టిన‌ట్లు క‌నిపిస్తున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘’. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ‘ఖిలాడి’ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలవుతుంది. ఇందులో ర‌వితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. అలాగే ఇద్ద‌రు హీరోయిన్స్ డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి జోడీ క‌ట్టారు. ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలో ర‌వితేజ ఇద్ద‌రు హీరోయిన్స్‌తో లిప్ లాక్ చేశార‌ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే అందుకు ఇదే ప్రూఫ్ అనేలా డింపుల్ హ‌య‌తితో ర‌వితేజ చేసిన లిప్ లాక్ సీన్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. అది వైర‌ల్ అవుతుంది. ర‌వితేజ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్ర‌మిది. గ‌త ఏడాది సంక్రాంతికి క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో ఖిలాడి సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం ర‌వితేజ కెరీర్‌లో బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. సినిమా స‌క్సెస్‌పై న‌మ్మ‌కంతో నిర్మాత కోనేరు స‌త్య నారాయ‌ణ ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌కు ఖ‌రీదైన కారుని కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇవి కాకుండా రామారావు ఆన్ డ్యూటీ, ధ‌మాకా, రావ‌ణాసుర చిత్రాలు విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BIkdMF1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...