Tuesday, 4 January 2022

లవ్ సింబల్‌తో సమంత పోస్ట్.. యంగ్ యాక్టర్‌తో అలా! నువ్వు లేకుంటే నేనేమి చేయగలనంటూ..

నాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం తన లైఫ్ స్టైల్ మార్చేసింది స్టార్ హీరోయిన్ . తనను తాను మరింత స్ట్రాంగ్‌గా మలచుకుంటూ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెడుతోంది. విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాలు మరిచేలా స్నేహితులతో టూర్స్ వేస్తూ సరదా సమయాన్ని గడుపుతోంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం శిల్పా రెడ్డి, ఇతర స్నేహితులతో కలిసి గోవా వెళ్లి అక్కడి బీచ్ అందాల నడుమ ఎంజాయ్ చేసింది సమంత. కెరీర్ పరంగా కూడా చకచకా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తూ ముందుకెళ్తున్న సమంత.. మరోవైపు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ నెటిజన్ల ముందుంచుతూ తానేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లవ్ సింబల్‌తో ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలోని చాలా తక్కువమందితో స్నేహంగా మెదిలే సామ్.. కమెడియన్ , తన స్నేహితురాలు చిన్మయి, ఆమె భర్త చాలా సన్నిహితంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ లతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ 'నువ్వు లేకుంటే నేనేమి చేయగలను?' అని కామెంట్ పెట్టడమే గాక దానిపై లవ్ సింబల్ పెట్టేసింది సమంత. ఈ ఫొటో చూస్తుంటే సమంత, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ కలిసి ఒకే చోట కలిసి చిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవలే 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్‌ చేసి థియేటర్లలో ఆడియన్స్ చేత గోల పెట్టించింది. మరోవైపు ఆమె లీడ్ రోల్ పోషిస్తున్న యశోద సినిమా షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో తన తొలి పౌరాణిక మూవీ 'శాకుంతలం' కంప్లీట్ చేసింది సమంత. దీంతో పాటు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్, హాలీవుడ్ డైరెక్టర్‌తో మరో సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pPKCcC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...