Tuesday, 4 January 2022

‘రాధే శ్యామ్’ వాయిదా.. డైరెక్టర్ ట్వీట్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జిల్‌’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో భారీ ఎత్తున సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే ఒమిక్రాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌లు రాష్ట్రాల్లో థియేట‌ర్స్‌ను మూసి వేశారు. మ‌రికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేసుకోమ‌ని అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా విడుద‌ల చేయడం నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని భావించిన ప‌లు భారీ చిత్రాల నిర్మాత‌లు వారి సినిమాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన భారీ చిత్రం RRR కూడా వాయిదా ప‌డింది. మ‌రో వైపు ప్ర‌భాస్ ‘’ కూడా వాయిదా పడే అవకాశం ఉంద‌ని.. డైరెక్ట్‌గా OTTలోనే విడుద‌లైయ్యే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే మేక‌ర్స్ ‘రాధే శ్యామ్’ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ చేసిన లేటెస్ట్ ట్వీట్ సినీ ప్రియులు, ఫ్యాన్స్‌లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ వాయిదాను ఉద్దేశించేలా డైరెక్ట‌ర్ ట్వీట్ పెట్టార‌ని అంద‌రూ అంటున్నారు. ఇంత‌కీ ‘రాధే శ్యామ్’ డైరెక్ట‌ర్ ఏమ‌ని ట్వీట్ చేశారో తెలుసా!..‘‘సమయం కఠినంగా ఉంది. హృద‌యాలు బ‌ల‌హీనంగా ఉన్నాయి. మ‌న‌సులు అల్ల‌క‌ల్లోలంగా ఉన్నాయి. జీవితం మ‌న పైకి ఏది విసిరినా మ‌న ఆశ‌లు గొప్ప‌గా ఉంటాయి. అంద‌రూ సుర‌క్షితంగా ఉండండి’’ అంటూ ట్వీట్ చేశారు డైరెక్ట‌ర్ రాధా కృష్ణ‌. ట్వీట్‌ను ఉద్దేశించి ‘రాధే శ్యామ్’ వాయిదా ప‌డుతుందా? అని ప్ర‌శ్నిస్తే.. అలాంటిదేమీ లేదు. ఒక‌వేళ ఉంటే డైరెక్ట్‌గా అధికారికంగా చెబుతామంటూ ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. కానీ సినిమా ప్ర‌మోషన్స్ చేయ‌క‌పోవ‌డం కూడా అంద‌రి అనుమానాల‌కు తావిస్తుంది. యూర‌ప్ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థా చిత్రంగా ‘రాధే శ్యామ్’ తెర‌కెక్కింది. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రికా నిపుణుడిగా క‌నిపించ‌నున్నారు. సాహో సినిమా విడుద‌లై రెండున్న‌రేళ్లు గ‌డుస్తుంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zpYiOY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...