Tuesday, 4 January 2022

బాలకృష్ణ కోసం ప్లాన్ మార్చేసిన పూరి జగన్నాథ్.. రంగంలోకి విజయ్ దేవరకొండ! ఆహా ఏం స్కెచ్

''నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె! వసూలు వసూలు.. పైసా వసూల్'' అంటూ స్టామినా ఎలా ఉంటుందో ముందే ఉహించి ప్రేక్షకులకు తెలియజెప్పారు డాషింగ్ డైరెక్టర్ . నందమూరి నటసింహం బాలకృష్ణతో 'పైసా వసూల్' అంటూ మాస్ ఆడియన్స్ చేత గోల పెట్టించారు. అయితే ఇప్పుడు అదే ట్రాక్‌లో వెళ్తూ తొలిసారి ఓ షోకి హోస్ట్ అవతారమెత్తారు బాలకృష్ణ. '' అంటూ ఓటీటీ వేదిక 'ఆహా'పై దూసుకుపోతున్నారు. బాలయ్య జోరుతో ఈ షో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ పైసా వసూల్‌లో కీలకమైన అస్త్రంగా మారింది. అన్‌స్టాపబుల్‌ విత్ NBK అంటూ సరికొత్తగా ప్లాన్ చేసిన ఆహా మేనేజ్‌మెంట్ ఫుల్ సక్సెస్ అయింది. ఈ షోలో సెలబ్రిటీలతో బాలకృష్ణ మాట్లాడుతున్న విధానం, ఆయన స్టైల్ ప్రేక్షకులను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. తొలి షోలో మంచు మోహన్ బాబు సహా ఆ ఫ్యామిలీతో సరదా ముచ్చట్లు మాట్లాడుతూనే కొన్ని సీక్రెట్స్ బయటపెట్టించి 'అన్‌స్టాపబుల్‌' రెస్పాన్స్ తెచ్చుకున్నారు బాలయ్య బాబు. ఇక తదుపరి ఎపిసోడ్స్‌లో కూడా అదే ఎనర్జీ చూపిస్తూ సెలబ్రిటీల తాలూకు ఎన్నో విషయాలను టచ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. వెండితెరనే కాదు ఆన్‌లైన్ వేదికపై కూడా హంగామా చేయగలనని నిరూపిస్తున్న నటసింహం.. ఇప్పటికే నాని, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో పాటు రాజమౌళి, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్లను ఇంటర్వ్యూ చేశారు. అలా ఇప్పటికే 7 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు రానాతో చేసిన ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇకపోతే ఆ తదుపరి ఎపిసోడ్ తనతో 'పైసా వసూల్' అంటూ స్టెప్పులేపించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చేయబోతున్నారట బాలకృష్ణ. ప్రస్తుతం 'లైగర్' సినిమా పనులతో ఫుల్ బిజీగా ఉన్న పూరి జగన్నాథ్.. తన ప్లాన్ ఛేంజ్ చేసుకొని మరీ బాలయ్య షో కోసం అటెండ్ అవుతున్నారని టాక్. అంతేకాదు తనవెంట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను కూడా తీసుకొస్తున్నారట. ఈ ముగ్గురితో చేయబోతున్న ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రసారం చేయాలని భావిస్తుస్తోందట ఆహా మేనేజ్‌మెంట్. అంతేకాదు ఇందులో 'లైగర్' సినిమా విశేషాలతో పాటు పూరి లైఫ్ సీక్రెట్స్ చాలా చెప్పించబోతున్నారట బాలకృష్ణ. సో.. ఇదే నిజమైతే ఆహా వేదికపై 'పైసా వసూల్' కాంబో అల్లరి మామూలుగా ఉండదు లెండి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34dIWRT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...