Tuesday, 4 January 2022

సీఎం కొడుకుతో కీర్తి సురేష్ న్యూ స్టెప్.. బాగా ఆలోచించి ఫైనల్ అయిన యంగ్ హీరోయిన్

కెరీర్ ఆరంభం నుంచే నటిగా తనదంటూ ఓ స్పెషల్ వే అని నిరూపించుకుంటోంది హీరోయిన్ . పలు సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించి ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న ఈ అమ్మడు.. ఎంతో క్రమశిక్షణతో కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. దర్శకులు వినిపించిన కథ నచ్చడమే కాకుండా అందులో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది ఓ అంచనాకు వచ్చాకే సినిమా చేసేందుకు ఓకే చెప్పడం ఆమె నైజం. అలా సెలక్టెడ్ సినిమాలతో అలరిస్తున్న కీర్తి.. తాజాగా తమిళంలో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్ కే.స్టాలిన్ తనయుడు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుందట. గత ఎన్నికల్లో చెపాక్- తిరువల్లికేని నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభ సభ్యుడుగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా రాణించాలని మంచి కథలను వింటున్నారట. ఈ క్రమంలోనే సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యారని, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్‌తో సంప్రదింపులు జరపగా.. బాగా ఆలోచించి ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో పాటు, ఎంత బిజీగా ఉన్నా కూడా సీఎం కొడుకు అనే ఒక కారణంతో కీర్తి సురేష్ ఈ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు ఏఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించనున్నారని, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలో నటించనున్నారని టాక్. మరోవైపు తెలుగులో మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట', చిరంజీవి హీరోగా చేస్తున్న 'భోళా శంకర్' సినిమాలతో బిజీగా ఉంది కీర్తి సురేష్. అదేవిధంగా ఆమె నటించిన ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zq3lyU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...