Monday, 24 January 2022

‘పుష్ప’ సాంగ్‌కి డేవిడ్ వార్న‌ర్ స్టెప్పులు.. రియాక్ట్ అయిన అల్లు అర్జున్‌!

ఐకాన్ స్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘పుష్ప ది రైజ్‌’. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాన్ ఇండియా రేంజ్‌లో గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క్ర‌మంగా అది బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ అయ్యింది. వ‌సూళ్ల ప‌రంగా ది రైజ్ దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ స‌త్తా చాటింది. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు సినిమాకు ఎసెట్ అయ్యాయి. ప్ర‌తి పాట సూప‌ర్ డూప‌ర్ హ‌ట్ అయ్యింది. ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్సే కాదు..సెల‌బ్రిటీలు సైతం పుష్ప ది రైజ్‌లోని పాట‌ల‌కు స్టెప్పులేస్తున్నారు. ఇండియ‌న్ టీమ్ క్రికెట‌ర్స్‌లో శిఖ‌ర్ ధావ‌న్‌, ర‌వీంద్ర జ‌డేజా, సూర్య కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్ వంటి వారు సైతం ఈ గ్రూపులో చేరారు. ఇక ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లేదు. ఐపీఎల్ ఆడుతున్న‌ప్ప‌టి నుంచి ఈ క్రికెట‌ర్ ఇండియ‌న్ సినిమాలంటే ఆస‌క్తి పెంచుకున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది సినిమాల‌పై మ‌రీ ఎక్కువ ల‌వ్ పెంచేసుకున్నారు. ముఖ్యంగా మ‌రీ అల్లు అర్జున్ అల వైకుంఠ‌పుర‌ములో పాట‌ల‌కు స్టెప్పులేసి ర‌చ్చ చేసేశారాయ‌న‌. ఇప్పుడు పుష్ప ది రైజ్ సాంగ్స్‌కు కూడా డేవిడ్ వార్న‌ర్ త‌న‌దైన రీతిలో డాన్సులు చేసి ఆక‌ట్టుకునేస్తున్నారు. ఫేస్ మాస్కు వీడియోతో ఏ బిడ్డా ఇది అడ్డా అంటూ పాట పాడేసిన డేవిడ్ వార్న‌ర్ రీసెంట్‌గా శ్రీవ‌ల్లి సాంగ్‌లో కాళ్లు ఈడ్చే స్టెప్పేసి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడైతే ఆయ‌న పిల్ల‌లు కూడా మేం సైతం పుష్ప‌రాజ్ అభిమానులుగా మారిపోయారు. సినిమాలో సామి సామి అనే పాట‌కు డేవిడ్ వార్న‌ర్ పిల్లలు చేసిన డాన్సింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఆ వీడియోను అల్లు అర్జున్ కూడా లైక్ చేసి ల‌వ్ సింబ‌ల్‌ను షేర్ చేయ‌డం విశేషం. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకు తొలి భాగంగా పుష్ప ది రైజ్ సినిమా విడుద‌లైంది. దీనికి కొన‌సాగింపుగా రూపొందాల్సిన పుష్ప ది రూల్ మూవీ ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంద‌ని, ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IADSGj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...