Monday, 24 January 2022

రంగ రంగ వైభవంగా: వైష్ణవ్ తేజ్‌కి కేతిక శర్మ బట్టర్ ఫ్లై కిస్

మెగా కాంపౌండ్ హీరోగా, సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా 'ఉప్పెన' సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన .. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. వైష్ణవ్ నటనపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అలా ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో 'కొండ పొలం' సినిమా చేశారు. ఇప్పుడు '' అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్.. ఈ టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ''అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలనుకుంటే తనతో పాటు ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు తెలుసా?" అంటూ బాయ్ ఫ్రెండ్‌కి గర్ల్ ఫ్రెండ్ చెబుతున్న డైలాగ్‌తో ప్రారంభించి.. నీకు 'బటర్ ఫ్లై కిస్' తెలుసా అనే హీరోయిన్ రొమాంటిక్ డైలాగ్‌తో ఈ వీడియోలో హీరో హీరోయిన్ల మధ్య 'బటర్ ఫ్లై కిస్' అనే డిఫరెంట్ ముద్దు చూపించారు. లిప్ లాక్‌తో కూడిన ఈ టైటిల్ టీజర్ యూత్ ఆడియన్స్‌ని ఫిదా చేస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్ అయింది. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఏడాదిలోనే 'రంగ రంగ వైభవంగా' ప్రేక్షకుల ముందుకు రానున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3H0pBCg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...