Sunday, 23 January 2022

‘నన్ను పెళ్లి సేసుకుంటావా!’ అంటూ అడిగేసిన కీర్తి సురేష్

మీరింకా ఎందుకు పెళ్లి సేసుకోలేదు అని అంద‌మైన ఓ వ్య‌క్తిని ప్ర‌శ్నిస్తే.. ఏమ‌ని స‌మాధానం చెబుతాడు. అలాగే న‌న్ను పెళ్లి సేసుకుంటావా? అని అడిగితే అప్పుడేం చెబుతాడు? మ‌న‌సులో తెలియ‌ని ఓ సందిగ్ధ‌త నెల‌కొంటుంది. మ‌రి కీర్తి సురేష్‌లాంటి అంద‌మైన అమ్మాయి అడిగితే అస్స‌లు స‌మాధానం కూడా త‌ట్ట‌దు. మ‌రి స‌మాధానం కావాలంటే ‘’ సినిమా చూడాల్సిందే. టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకుడు. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 28న సినిమా విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా నుంచి టీజర్ విడుద‌ల చేశారు. ‘గుడ్ లక్ సఖి’ సినిమా ట్రైలర్‌ను గ‌మ‌నిస్తే కీర్తి సురేష్‌, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టిల‌పైనే సినిమా ర‌న్ అవుతుంద‌ని తెలుస్తోంది. దేశం గ‌ర్వించే ద‌గ్గ రైఫిల్ షూటర్స్‌ను త‌యారు చేయాల‌నుకునే వ్య‌క్తి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపిస్తుంటే.. బ్యాడ్ ల‌క్ ఉండే అమ్మాయి స‌ఖిగా కీర్తి సురేష్‌, ఆమెను ప్రేమించే కుర్రాడిగా ఆది పినిశెట్టి క‌నిపిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుని బ్యాడ్ ల‌క్ స‌ఖి గుడ్ ల‌క్ స‌ఖిగా మారిందా? దేశం గ‌ర్వించే షూటర్‌గా త‌యారైందా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో కీర్తిసురేష్ ప‌ల్లెటూరి అమ్మాయిగా అమాయకంగా క‌నిపిస్తూ జ‌గ‌ప‌తిబాబుని పెళ్లి గురించి ప్ర‌స్తావించ‌డం , సినిమాలో ఎమోష‌నల్, కామెడీ యాంగిల్ అన్నింటినీ చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. కీర్తి సురేష్ ఒక‌వైపు మ‌హేష్‌తో జంట‌గా స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నారు. మ‌రో వైపు పెంగ్విన్‌, మిస్ ఇండియా ఇప్పుడు గుడ్ ల‌క్ స‌ఖి, సాని కాయిదం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ న‌టిస్తున్నారు. మ‌రో వైపు చిరంజీవి టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న బోళా శంక‌ర్ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగానూ కీర్తి సురేష్ న‌టిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IyKOn0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...