Monday, 24 January 2022

Chiranjeevi: శరవేగంగా 'భోళా శంకర్' పనులు.. కీర్తి సురేష్‌ ఎంటర్!

ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఆచార్య వర్క్స్ చకచకా కంప్లీట్ చేస్తూనే గాడ్ ఫాదర్, సినిమాల పనులతో బిజీ అయ్యారు మెగాస్టార్. ఈ క్రమంలోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా 'భోళా శంకర్' షూటింగ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదట చిత్రయూనిట్. సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో షురూ చేసేశారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు కీర్తి సురేష్ కూడా భాగం అవుతున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని, ఇందులో చిరంజీవి- కీర్తి మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని సమాచారం. అలాగే హీరోయిన్‌గా నటిస్తున్న తమన్నాతో కూడా కొన్ని సీన్స్ షూట్ చేస్తారట. కొద్ది రోజుల్లోనే 'భోళా శంకర్' సెట్స్ మీదకు తమన్నా రానుందట. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న ఈ 'భోళా శంకర్' సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ రోల్ పోషిస్తోంది. మహతి స్వర సాగర్ బాణీలు కడుతున్నారు. ఇటీవలే విడుదల చేసిన 'భోళా శంకర్' ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ కూడా షూట్ చేసిన మేకర్స్ వీలైనంత త్వరగా ఈ సినిమా పనులన్నీ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IzXEBD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...