Saturday, 1 January 2022

ముందు నువ్వేంటో తెలుసుకో.. ఇతరుల అభిప్రాయాలతో పనేంటి? సమంత స్ట్రాంగ్ మెసేజ్

నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న స్టార్ హీరోయిన్ తనను తాను ఎంతో స్ట్రాంగ్‌గా మలచుకుంటోంది. విడాకుల తాలూకు విషయాన్ని పూర్తిగా మరచిపోయి కెరీర్ పట్ల శ్రద్ద వహిస్తోంది. ఈ మేరకు కొత్త అడుగులేస్తూ తన అభిమానులను హుషారెత్తిస్తోంది సమంత. ఇకపోతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పే సామ్.. అప్పుడప్పుడు మోటివేషనల్ సందేశాలతో ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ సందేశం వైరల్ అవుతోంది. ''ఇతరులు ఏమనుకుంటున్నారు.. వాళ్ళు నమ్మేదేంటి? మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఇలాంటివన్నీ కూడా జైలు ఊచలాంటివి. ఆ ఊచలు ఎదుటివారి మనసుకే ఉన్నాయని, మీకు కాదని గ్రహించి వీటి నుంచి విముక్తి పొందాలి. మీరు చేసే పనులకు ఇతరుల అభిప్రాయాలతో అవసరం లేదు. మీరు ఒంటరిగా ఉన్నా కూడా నిజమైన వ్యక్తిత్వంతో ఉండండి. ఎవరి ప్రశంసలు కూడా అవసరం లేదు. అవే మిమ్మల్ని అసంపూర్ణం చేస్తాయి. ఒకసారి గనక ఇది అర్థం చేసుకుంటే.. మనస్పూర్తిగా మీరు స్వేచ్చగా బ్రతక గలుగుతారు. అంతేకాదు గతంలో కంటే ఎక్కువగా గౌరవం కూడా పొందుతారు'' అని పోస్ట్ చేసింది సమంత. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. విడాకుల ఇష్యూ తర్వాత కెరీర్ విషయంలో దూసుకుపోతోంది సమంత. ఇటీవలే అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ చేత ఈలలు వేయించింది. మరోవైపు శ్రీ దేవి మూవీస్‌ పతాకంపై యశోద సినిమా కంప్లీట్ చేసింది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా ఫినిష్ చేసింది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్న సమంత ట్రెండ్‌కి తగ్గట్లుగా తననుతాను మలచుకుంటానని చెబుతుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EIaGdR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...