Saturday, 1 January 2022

ప్రభాస్ 'రాధే శ్యామ్' రిలీజ్‌పై పుకార్లు.. కొత్త పోస్టర్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

గత ఏడాదిన్నరకు పైగా సినీ ఇండీస్ట్రీని కరోనా కష్టాలు వీడటం లేదు. మెల్లమెల్లగా పరిస్థితులు సద్దుమణిగి ఇండీస్ట్రీకి పూర్వ వైభవం వస్తుందనే లోపే కొత్త కొత్త వేరియంట్స్ కంగారు పుట్టిస్తున్నాయి. రీసెంట్‌గా ''అఖండ, పుష్ప'' లాంటి భారీ సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడంతో ఈ సంక్రాంతికి RRR, చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే ఇంతలో ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ఆందోళన రేకెత్తిస్తుండటంతో ఈ రెండు సినిమాల విడుదల వాయిదా వేసినట్లు టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది రాధే శ్యామ్ యూనిట్. ‘రాధే శ్యామ్‌’ రిలీజ్ డేట్ విషయమై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిసేలా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వదిలిన ఈ పోస్టర్‌లో జనవరి 14న ఈ సినిమా విడుదల కానుందని పేర్కొన్నారు. దీంతో రాధే శ్యామ్ రిలీజ్ విషయంలో జనానికి పూర్తి క్లారిటీ వచ్చేసింది. సినిమా వాయిదా పడటం లేదని తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోపక్క రాజమౌళి రూపొందిస్తున్న RRR కూడా వాయిదా వేస్తున్నారంటూ తెగ రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ ‘రాధే శ్యామ్‌’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్‌ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రోల్ విభిన్నంగా ఉండనుందని తెలియడం సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ డిఫెరెంట్ లుక్‌లో కనిపించనున్నారట. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FNqAVE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...