తనదైన గాత్రంతో సంగీత ప్రియులకు ఆల్ టైమ్ ఫేవరేట్ అయ్యారు . సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉండే ఆమె గతేడాది ఆరంభంలోనే రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మీడియా పర్సన్, బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టిన సునీత.. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న సునీత పెళ్లి తర్వాత తన జీవితం గురించి, 2021లో జరిగిన విషాదాల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు నచ్చినట్లుగా ఉంటూ జీవితంలో గౌరవంగా బతకాలని అనుకున్నానని, తన ఫేస్ చూస్తుంటే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందనేది మీకే అర్థమైపోతుందని చెప్పారు సునీత. తన జీవితంపై తనకంటూ క్లారిటీ ఉందని చెప్పిన ఆమె.. తన భర్త రామ్‌ది, తనది ఇంచుమించు ఒకే రకమైన ప్రొఫెషన్ కావడంతో అప్పుడప్పుడు ఆయనకు సాయపడుతుంటానని చెప్పుకొచ్చారు. కాకపోతే ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆమె పేర్కొనడం విశేషం. 2021 సంవత్సరంలో ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకున్నానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు సునీత. ముఖ్యంగా బాలు గారిని పోగొట్టుకున్న బాధ తనను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు. ఆ విషాదం తర్వాత ఎలాంటి సందర్భంలో అయినా కన్నీళ్లు రావడమే ఆగిపోయాయని అన్నారు. ఏదైనా విషాద ఘటన గురించి తెలిసినప్పుడు మహా అయితే షాకవుతున్నా కానీ ఏడుపు, కన్నీళ్లు రావడం లేదని చెప్పారు. బాలు గారు లేని లోటు తీర్చలేనిదంటూ ఎమోషనల్ అయ్యారు సింగర్ సునీత. ఓ వైపు సింగర్‌గా రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు సునీత. ఎప్పటికప్పుడు తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లతో టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్నారు సునీత.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31iZxCS
v
No comments:
Post a Comment