Sunday, 2 January 2022

తల్లి కాబోతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కన్ ఫర్మ్ చేసిన గౌతమ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె భర్త తెలియజేశారు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌ను గౌతమ్ - జంట గోవాలో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘2022లో నిన్నే చూస్తున్నాను’ అని కామెంట్‌తో పాటు ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని షేర్ చేశారు గౌతమ్. దీంతో కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గౌతమ్ కన్‌ఫర్మ్ చేసినట్లు అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్ ఉమ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ మూవీ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇందులో తానొక మిస్టీరియ‌స్ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించనుంది కాజల్. ఇదొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. టాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టిన కాజల్ అగర్వాల్.. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటనకు సిద్ధమనే ప్రకటించింది. పెళ్లి తర్వాత కాజల్ నటించిన చిత్రం చిరంజీవి ‘ఆచార్య’. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. అలాగే ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ అయిన ఇండియ‌న్ 2లోనూ క‌మ‌ల్ హాస‌న్‌తో ఈమె క‌లిసి న‌టించింది. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగింది. మ‌రి ఈ సినిమాల‌న్నీ విడుద‌లైతే కాజ‌ల్‌, హీరోయిన్‌గా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుని కంటిన్యూ అవుతుందేమో చూడాలి. ప్రెగ్నెన్సీ కారణంగానే కాజల్ నాగార్జునతో ఘోస్ట్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేదు. 2004లో న‌టిగా ఈమె త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాజ‌ల్ ప‌రిచ‌య‌మైంది. అప్ప‌టి నుంచి తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్ ఇలా స్టార్ హీరోలంద‌రి సినిమాల్లోనూ న‌టించి న‌టిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వ‌చ్చింది. గ‌త ఏడాదిలోనే పెళ్లి చేసుకుంది. సినిమాల‌తో పాటు డిజిట‌ల్ మాధ్య‌మంలోనూ కాజ‌ల్ అగ‌ర్వాల్ నటించింది కూడా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mPrCJs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...