Sunday, 2 January 2022

ఇలా ఎప్పుడూ జరగలేదు!.. దుబాయ్‌లో నయన్‌తో విఘ్నేశ్ శివన్

సినీ ప్రపంచంలో ప్రేమకథల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. నయనతార సినీ కెరీర్‌లో ఎంతటి విజయాలను చూసి ఆనంద పడిందో.. పర్సనల్ కెరీర్‌లో బ్రేకప్పులతో అంతటి దు:ఖాన్ని అనుభవించింది. నయనతార లవ్ స్టోరీలు, బ్రేకప్పుల గురించి అందరికీ తెలిసిందే. శింబు, ప్రభుదేవా వంటివారితో నయన్ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. కానీ చివరి నిమిషంలో అంతా తారుమారు అయిపోయింది. ప్రస్తుతం నయనతార డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది. అయితే ఈ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందా? లేదా? అని ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే తమ బంధం మీద వచ్చే రూమర్లను , నయనతార ఖండిస్తుంటారు. ఫన్నీ వీడియోలతో రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. తాజాగా ఈ జంట కొత్త ఏడాదిని ఘనంగానే సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే ఈ జంట వెకేషన్లు వేయడంలో ఎంతో శ్రద్ద చూపిస్తుంటారు. ఎక్కువగా న్యూయార్క్‌లో ఈ జంట చక్కర్లు కొడుతుంది. లేదంటే గోవా, కేరళ, తమిళనాడులకు చెక్కేస్తుంటుంది. అయితే ఈ సారి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దుబాయ్‌కి వెళ్లినట్టు, అది కూడా షార్టెస్ట్ వెకేషన్ అని, ఇంత వరకు ఇలా ఇంత చిన్న వెకేషన్ ఎప్పుడూ వేయలేదని విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇద్దరూ బుర్జ్ ఖలీఫా వద్ద దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అర్మాని హోటల్, బుర్జ్ ఖలీఫా స్టాఫ్‌కు విఘ్నేశ్ శివన్ థ్యాంక్స్ చెప్పాడు. వారి అతిథి మర్యాదలకు విఘ్నేశ్ ఫిదా అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది అయినా కూడా విఘ్నేశ్ నయన్ జంట ఒక్కటవుతుందా? లేదా? అనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32zq8fH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...