Sunday, 2 January 2022

హీరోయిన్‌‌కి కాంగ్రెస్ లీడ‌ర్ కొడుకు పెళ్లి రిక్వెస్ట్.. ట్వీట్ డిలీట్!

బాలీవుడ్ హీరోయిన్‌కి ప్ర‌ముఖ దివంగ‌త కాంగ్రెస్ నాయ‌కుడు అహ్మ‌ద్ ప‌టేల్ కుమారుడు ఫైజ‌ల్ పటేల్ ట్విట్ట‌ర్ ద్వారా బ‌హిరంగంగా పెళ్లి చేసుకోమ‌ని రిక్వెస్ట్ చేశాడు. తీరా ఏమైందో ఏమో కానీ, ఆయ‌నే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఇంత‌కీ ఫైజ‌ల్ ఫటేల్ రిక్వెస్ట్ చేసిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా!.. అమీషా ప‌టేల్‌. శ‌నివారం (జ‌న‌వ‌రి 1) ఫైజ‌ల్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా ప‌లువురు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ హీరోయిన్ అమీషా ప‌టేల్ కూడా ఫైజ‌ల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ .. లవ్ యూ.. నీకిది అద్భుతమైన సంవత్సరం కావాలి’ అని ట్వీట్తో పాటు ఆయనతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది . అయితే ఫైజల్ మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలోనే పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు. ‘అమీషా పటేల్ థాంక్స్. నేను బహిరంగంగా, అధికారికంగా పెళ్లి ప్రపోజల్ చేస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ట్వీట్ చేశాడు. తర్వాత సదరు ట్వీట్‌ను డిలీట్ చేశాడు ఫైజల్. అయితే అప్పటికే నెటిజన్స్ ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసేశారు. అదిప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఫైజల్ హెచ్.ఎం.పి ఫౌండేషన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఇది వరకే జైనాబ్‌తో పెళ్లి అయ్యింది. ఆమె 2017లో గుండె పోటుతో కన్నుమూసింది. బాలీవుడ్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ తెలుగులోనూ బద్రి, నరసింహుడు, పరమవీరచక్ర , నాని వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32EN7Wx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...