మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో మంత్రి మీట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లో బైక్ ప్రమాదానికి గురై రీసెంట్‌గా కోలుకున్న సాయి ధరమ్ తేజ్‌ని పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా స్వయంగా తేజ్ ఇంటికి వెళ్లిన మంత్రి కిషన్ రెడ్డి.. ఆయన యోగ క్షేమాలు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కిషన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు సాయి ధరమ్ తేజ్. ''మీరు మీ బిజీ షెడ్యూల్‌లో కూడా నన్ను కలిసేందుకు స్వయంగా మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్న సాయి తేజ్.. ఆయనతో కలిసి దిగిన ఫొటోస్ షేర్ చేశారు. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, సాయి ధరమ్ తేజ్‌కి ప్రత్యేకంగా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఈ ఏడాది ఆయన మరిన్ని సూపర్ హిట్ సినిమాలతో సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నారు. బైక్ యాక్సిడెంట్ తర్వాత కొద్ది రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం పూర్తిగా కోలుకొని తిరిగి సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఎప్పటిలానే రెగ్యులర్ సినిమాలతో బిజీ అయ్యేందుకు ఆయన సిద్దమయ్యారట. దీంతో సాయి తేజ్ కొత్త సినిమా అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నందితో సాయి తేజ్ న్యూ మూవీ ఉండబోతోందని, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఏదేమైనా సాయి తేజ్ సినిమా కోసం టాలీవుడ్ లోకం ఆతృతగా ఎదురు చూస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G0Yirb
v
No comments:
Post a Comment