Saturday, 1 January 2022

విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్.. పవన్ కళ్యాణ్‌ని బీట్ చేస్తూ ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్

గతంలో సినిమా విడుదలయ్యాక రికార్డ్స్ గురించి చెప్పుకునేవారు.. కానీ కాలం మారింది. సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ గురించి చెప్పుకోవాల్సిన రోజులొచ్చేశాయి. ఆన్ లైన్ మాధ్యమాలకు పెరుగుతున్న గిరాకీతో యూట్యూబ్ రికార్డ్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల్లోని ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నాయి. దీంతో డిజిటల్ రికార్డ్స్ పరంగా తెలుగు హీరోలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ రౌడీ స్టార్ సరికొత్త రికార్డ్ నమోదు చేశారు. '' సినిమాతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ.. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' పేరిట ఉన్న రికార్డు తిరగరాశారు. ఇటీవలే 'లైగర్' మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పూరి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియోలో విడుదలైన మరుక్షణం నుంచే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో ఈ వీడియోకు విడుదలైన 24 గంటల్లోనే 15.92 మిలియన్ వ్యూస్, 399.6K లైక్స్ వచ్చాయి. దీంతో వ్యూస్ పరంగా చూస్తే 8.49 మిలియన్ వ్యూస్‌తో అప్పటిదాకా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న 'భీమ్లా నాయక్' రికార్డు అధిగమించారు విజయ్ దేవరకొండ. ఈ జాబితాలో 'విక్రమ్' మూడో స్థానంలో, RRR నాలుగో స్థానంలో, 'సైరా నరసింహా రెడ్డి' ఐదో స్థానంలో ఉన్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'లైగర్' సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్‌ పెట్టారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HpMoar
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...