Sunday, 9 January 2022

ఏకంగా 8 హీరోయిన్లతో బంగార్రాజు! ఇక ఈ సంక్రాంతికి ఫుల్ కలరింగ్

అక్కినేని నాగార్జున, కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు' ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ‘మనం’ సినిమా తర్వాత ‘బంగార్రాజు’ సినిమాతో మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెర పంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ సక్సెస్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు సైతం వెనకడుగేసినా బంగార్రాజు మాత్రం రేసులోకి దూకుతున్నాడు. అయితే ఈ సినిమాలో 'బంగార్రాజు' రొమాంటిక్ డోస్ పీక్స్‌లో ఉండనుందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి ఆడిపాడింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, అన్ని అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపించబోతున్నారట. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలతో పాటు మరో ఆరుగురు అందాల భామలు కనిపించనున్నారని చెప్పారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ కలరింగ్ ఈ బంగార్రాజు సినిమాలో చూడనున్నాం. సందర్భానుసారంగా వచ్చే సన్నివేశాల్లో ఈ హీరోయిన్స్ వచ్చి వెళ్తుంటారట. ఈ లెక్కన చూస్తే అందాల భామలతో నాగ్ చిందులు, గ్లామర్ డోస్ బాగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఫరియా అబ్దుల్లా లిరికల్ సాంగ్ అయితే చూసేశాం. ఇక మిగిలిన హీరోయిన్స్ ఎలాంటి రొమాంటిక్ టచ్ ఇస్తారనేది సినిమా చూస్తే గానీ చెప్పలేం. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zSPnpv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...