హీరోగా రాబోతోన్న చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రాధే శ్యామ్ దిగబోతోంది. దేశ వ్యాప్తంగా రాధే శ్యామ్ సినిమా మీద అంచనాలున్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, చిన్న పాటి గ్లింప్స్‌లు నెట్టింట్లో సెన్సేషనల్‌గా మారాయి. అయితే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులతో కలిసి రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోబోతోన్నాడు. అయితే ఇలాంటి గ్రాండ్ ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తుంటారు. కానీ మొదటి సారిగా సుమను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. అయితే మామూలుగా స్టార్ హీరోల ఈవెంట్లు అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. కానీ తెరపై జాతి రత్నం హీరో , యాంకర్ రష్మీల పేర్లు వచ్చాయి. సుమ బిజీగా ఉండటం వల్ల ఈవెంట్‌ను చేయలేకపోతోందా? లేదంటే.. కావాలనే సుమను పక్కన పెట్టేసి ఇలా కొత్తగా ఉండాలని రష్మీ, నవీన్ పొలిశెట్టిలలో ఈవెంట్‌ను నడిపించాలని ప్లాన్ చేశారా? అన్నది చూడాలి. మొత్తానికి ఇప్పుడు ఈ అప్డేట్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ ఈవెంట్‌లో రష్మీ మెరవబోతోందనే వార్తలు ఆమె అభిమానులను కుదిపేస్తున్నాయి. మొత్తానికి అభిమానులు తమ మీద కురిపిస్తున్న ప్రేమకు రష్మీ ఫిదా అవుతున్నారు. మీరు ఇస్తున్న ఈ పాజిటివ్ వైబ్స్‌కు థ్యాంక్స్.. రేపటి ఈవెంట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని రష్మీ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు. ఇక రేపు మాత్రం డార్లింగ్ అభిమానులకు పండుగే పండుగ. అభిమానుల సమక్షంలోనే రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇక రికార్డులు బద్దలు కొట్టేయాలని డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఆ ట్రైలర్ 24 గంటల్లో ఎన్ని వ్యూస్, లైక్స్ కొల్లగొడుతుందో చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Efz1HL
v
No comments:
Post a Comment