Wednesday, 22 December 2021

ముగుస్తున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో.. మహేష్‌బాబు ఎపిసోడ్‌తో క్లోజ్.. Ahaపై అసహనం

నందమూరి బాలకృష్ణ టాక్ షో అంటే అమ్మబాబోయ్ అనుకున్నారు చాలామంది.. అందులోనూ ఫస్ట్ ఎపిసోడ్‌కి మోహన్ బాబు గెస్ట్ అనేసరికి అవహేళనలు మరింత ఎక్కువయ్యాయి. వాళ్లందరి నోళ్లు మూయించి ‘’ అంటూ తనలోకి కొత్త యాంగిల్‌ని బయటపెట్టారు నందమూరి బాలకృష్ణ. దెబ్బకి థింకింగ్ మారిపోవాలంతే అనేట్టు చేశారు బాలయ్య. వీడేం చేస్తాడు లేరా అనే స్థాయి నుంచి వీడే చేయాల్రా అనేట్టుగా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు బాలయ్య. హేళన చేసిన నోళ్లే ‘ఆహా’ అనేట్టు చేశారు బాలయ్య. మోహన్ బాబు (ఫ్యామిలీ), నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, వంటి గెస్ట్‌లతో ‘అన్‌స్టాపబుల్’ వినోదాన్ని పంచారు బాలయ్య. రవితేజ- గోపీచంద్ మలినేని ఎపిసోడ్‌ త్వరలో స్ట్రీమింగ్ కానుండగా.. ఈ ఎపిసోడ్ ప్రోమోకు సైతం అనూహ్య స్పందన లభిస్తోంది. అయితే చూసేకొద్దీ చూడాలనిపిస్తున్న ఈ టాక్‌కి త్వరలో ఎండ్ కార్డ్ పడబోతుంది. సీజన్ 1 ముగియనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్‌తో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 1 ముగియనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ‘ఆహా’. రాసిపెట్టుకోండి.. అంటూ ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అప్డేట్ ఇచ్చింది ఆహా. అయితే ఫినాలే ఎపిసోడ్‌ని ‘ఆహా’ ప్రకటించడంతో ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే సీజన్ 1 అయిపోవడం ఏంటి?? పట్టుమని పది ఎపిసోడ్‌లు కూడా లేకుండా షాక్ ఇచ్చారంటూ ‘ఆహా’పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. త్వరలోనే సీజన్ 2 మొదలుపెట్టేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మహేష్ బాబుతో బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EmtBuy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...