Wednesday, 22 December 2021

Pushpa కలెక్షన్ల విషయంలో బుక్కైన ఉదయ భాను.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా దొరుకుతారా? అని కొంత మంది నెటిజన్లు రెడీగా ఉంటారు. ఏదైనా విషయంలో సెలెబ్రిటీలు తప్పుగా మాట్లాడినా, మాటలు దొర్లినా కూడా నెటిజన్లు ఏకిపారేస్తుంటారు. అలా ఇప్పుడు యాంకర్ ఉదయభాను నెటిజన్లకు ఆహారంగా మారిపోయారు. ఉదయభానుని నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. దానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. అసలే కలెక్షన్ల విషయంలో ఎంతో మందికి ఎన్నో రకాల అనుమానాలున్నాయి. మామూలుగానే మైత్రీ సంస్థ ప్రకటించే అధికారిక లెక్కలపై నెట్టింట్లో ట్రోల్స్ నడుస్తుంటాయి. ఇక పుష్ప విషయంలో మైత్రీ చూపిస్తున్న అత్యుత్సాహం, చూపిస్తున్న లెక్కలపై మామూలుగా ట్రోలింగ్ జరగడం లేదు. ఇక మైత్రీ వారు చేసేదే ఎక్కువ అంటే.. వచ్చి దాన్ని మరింత ఎక్కువ చేసేసింది. పుష్ప సినిమా కలెక్షన్ల విషయంలో ఉదయభాను పొరబడింది. పుష్ప సక్సెస్ మీట్‌లో ఉదయ భాను నోరు జారడంతో నెట్టింట్లో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఉదయ భాను ఏదో పొరబాటుగా పుష్ప కలెక్షన్లను తప్పుగా పలికింది. దీంతో నెటిజన్లు ఆ విషయాన్నే పాయింట్ అవుట్ చేశారు. నిన్నటి నుంచి ఉదయభానుని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. పుష్ప 203 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పబోయి.. 2003 కోట్లు కలెక్ట్ చేసిందంటూ చెప్పేసింది. దీంతో ఉదయ భాను మళ్లీ బుక్కైంది. నాడు అఖండ సక్సెస్ మీట్‌లో ఉదయ భాను కాస్త ఓవర్‌గానే చేసిందనే టాక్ వినిపించింది. ఎవ్వరూ అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు.. అంటూ బాలయ్య బాబు మీద పొగడ్తల వర్షం కురిపించింది. బాలయ్య బాబు మంచిదనం గురించి ఎన్నో ఉదహరణలు చెబుతూ భజనలా చేసిందనే కామెంట్లు వినిపించాయి. ఇప్పుడేమో పుష్ప ఈవెంట్‌లో ఇలా నోరు జారి ట్రోలింగ్‌కు గురైంది. అయితే కొంత మంది మాత్రం ఉదయ భానుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత చిన్న విషయానికి ఇంతలా ట్రోల్ చేయాలా? అని అండగా నిలుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yXy6L9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...