Wednesday, 22 December 2021

డిమాండ్ చేస్తే తట్టుకోలేరు!.. రెమ్యూనరేషన్‌పై సింగర్ గీతా మాధురి కామెంట్స్

సింగర్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నారు. సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడంతో గీతా మాధురి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. జై బాలయ్య అనే సాంగ్‌కు థియేటర్ మొత్తం మార్మోగిపోయింది. అభిమానులు ఎవ్వరూ కూడా సీట్లలో కూర్చున్న దాఖలాలు లేవు. ఆ పాట, ఆ స్టెప్పులు అన్నీ కూడా నందమూరి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్‌లా మారిపోయింది. అయితే ఈ మూవీ సినిమా సక్సెస్‌లో జై బాలయ్య పాట కూడా ఓ మేజర్ పార్ట్‌లా మారిపోయింది. అయితే గీతా మాధురి ఈ మూవీ సక్సెస్, పాట ట్రెండింగ్‌లోకి రావడం మీద స్పందించారు. ప్రతీ పాటను అంతే నిబద్దతతో పాడతామని, ఈ పాటను ఎలా అయితే పాడానో అన్ని పాటలను అలానే పాడతాను.. కానీ కొన్ని హిట్ అవుతాయ్.. ఇంకొన్ని అవ్వవు అంటూ గీతా మాధురి చెప్పుకొచ్చారు. అయితే తాను పాటకు ఇంత ఇవ్వండి అని ఏనాడూ ఎవ్వరినీ కూడా డిమాండ్ చేయలేదని, ఒక వేళ తాను డిమాండ్ చేస్తే తట్టుకోలేరని గీతా మాధురి అన్నారు. తాను ఒక వేళ డిమాండ్ చేస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. నువ్ కూడా అడుగుతున్నావా? అని అంటారు.. తమన్ గారే పాటకు ఇంత అని ఫిక్స్ చేస్తారు అంటూ గీతా మాధురి తన రెమ్యూనరేషన్ గురించి చెప్పీ చెప్పకుండా అలా కొన్ని హింట్లు ఇచ్చారు. మొత్తానికి గీతా మాధురి మాత్రం మళ్లీ చాలా రోజులకు ఇలా ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆ మధ్య జనతా గ్యారేజ్ పక్కా లోకల్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేశారు. ఇప్పుడు జై బాలయ్య అంటూ గీతా మాధురి దుమ్ములేపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Em3dRN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...