Thursday, 23 December 2021

పాట పాడితే అన్నీ ఎగిరిపోయాయ్.. యాంకర్ సుమ వీడియో వైరల్

బుల్లితెర అయినా వెండితెర అయినా చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. చాలా రోజుల తరువాత మళ్లీ సుమ వెండితెరపై హల్చల్ చేయనున్నారు. అంటూ సుమ సందడి చేయబోతోన్నారు. అయితే సుమ తనలోని మల్టీ టాలెంట్‌ను అప్పుడప్పుడు బయటి ప్రపంచానికి చూపిస్తుంటారు. సుమకు నాట్యంలోనూ ప్రావీణ్యం ఉంది.. పాటలనూ ఆలపించగలరు. అలా సుమ ప్రస్తుతం తన సింగింగ్ టాలెంట్‌ను చూపించారు. ఇంతకు ముందు అనసూయ తమన్ సంగీత సారథ్యంలో సూయ సూయ అనసూయ అనే పాటను ఆలపించారు. ఇక ఇప్పుడేమో సోషల్ మీడియాలో అలా తన గాత్రాన్ని సరదాగా వినిపించారు. ప్రకృతిని చూసి సుమ కాస్త పరవశించినట్టు కనిపిస్తున్నారు. మొత్తానికి సుమ గాత్రానికి మాత్రం పక్షుల భయపడ్డాయనిపిస్తోంది. హోనన హోనన నచ్చానా? అంటూ బాహుబలి సినిమాలో తమన్నాలా పాట పాడేసింది సుమ. ఇక సుమ అలా పాడుతూ ఉంటే పక్కనే ఉన్న పక్షులు, సీతాకోక చిలుకలు ఎగిరిపోయాయి. ఇదే విషయాన్ని వీడియో ద్వారా చూపించారు సుమ. ఇక ఈ వీడియోతో పాటు సుమ చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. నేను పాడితే బట్టర్ ఫ్లైలు ఎగిరిపోయాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ ఆర్ఆర్‌ను కాకులు కావ్ కావ్ అని ఇస్తున్నాయ్ అంటూ సుమ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి సుమ మాత్రం సోషల్ మీడియాలోనూ ఇలా తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఇక త్వరలోనే వెండితెరపై జయమ్మగా ఆకట్టుకోనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qioSFr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...