Thursday, 23 December 2021

‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్‌’. హీరోయిన్‌. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ చేయ‌నటువంటి జోన‌ర్‌లో చేసిన చిత్ర‌మిది. ప్ర‌భాస్ లుక్స్‌, సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రిక తెలిసిన వ్య‌క్తిగా క‌నిపించ‌డ‌మే కాకుండా, ఇత‌రుల భ‌విష్య‌త్తుని తెలుసుకునే వ్య‌క్తిగా క‌నిపిస్తారు. టీజ‌ర్‌లో ఈ విష‌యం తేట తెల్ల‌మైంది. ఇప్పుడు ‘’ సినిమాను జనవరి 14, 2022న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. బాహుబలిగా పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో రాధే శ్యామ్‌తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. డిసెంబ‌ర్ 23న హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. దీని కోసం భారీగా ఏర్పాటు జ‌రుగుతున్నాయి. అభిమానులు భారీగా కార్లు, బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో రామోజీ ఫిలింసిటీకి చేరుకుంటున్నారు. వాహ‌న శ్రేణుల‌కు ప్ర‌త్యేకంగా పాసుల‌ను ఇష్యూ చేశారు. నేష‌న‌ల్ మీడియా కూడా ఈవెంట్‌ను కవర్ చేయడానికి ఆర్ఎఫ్‌సీ చేరుకుంది. ఈ కార్యక్రమానికి 40 వేలకు పైగా ఫ్యాన్స్ ఫిలిం సిటీకి చేరుకుంటున్నారని సమాచారం. అభిమానుల సమక్షంలోనే ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌లో రాధే శ్యామ్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. భారీ కటౌట్స్ అభిమానుల‌కు స్వాగతం ప‌లుకుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే చిత్రంలో క‌నిపించ‌నంత స్టైలిష్‌గా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన లుక్స్‌కు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మర్ప‌ణ‌లో యువీ క్రియేష్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yVs0Lu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...