Thursday, 23 December 2021

సినిమా వాళ్లకు హెల్ప్ చేయండి.. మీ నాన్న గారి అభిమానిని.. సీఎం జగన్‌ను వేడుకున్న బ్రహ్మాజీ

టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు ఎంతటి దయనీయంగా మారిందో అందరికీ తెలిసిందే. సినిమాకు హిట్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ అయినా కూడా ఏపీలో మాత్రం గట్టెక్కని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో టికెట్ రేట్లపై వస్తోన్న మీమ్స్, ట్రోల్స్ అందరికీ తెలిసిందే. కప్పు టీ, సులభ్ కాంప్లెక్స్ రేట్ల కంటే కూడా టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. దీనిపై నెట్టింట్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి తోడుగా నేడు నాని చేసిన కామెంట్లు మాత్రం మరోసారి దుమారాన్ని రేకెత్తించాయి. సినిమా టికెట్ రేట్లు మరీ అంతగా తక్కువ చేయడం అంటే.. ప్రేక్షకులను అవమానపరిచినట్టే.. థియేటర్ పక్కన ఉండే కిరాణ కొట్లోనే కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది అంటూ నాని కామెంట్లు చేశాడు. ఈ కామెంట్లు ఇప్పుడు దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏపీ మంత్రులు నాని వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తున్నారు. ఇక నిర్మాత నట్టి కుమార్ అయితే ఏకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేశాడు. అయితే నటుడు వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. వైఎస్ జగన్‌కు నాన్న సెంటిమెంట్ ఉందన్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పేరు చెబితే జగన్ ఏమైనా కరిగిపోతాడేమోనని బ్రహ్మాజీ భావించినట్టున్నాడు. దీంతో బ్రహ్మాజీ వేడుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరించింది. సర్.. అందరికీ వరాలు ఇస్తున్నారు.. పాపం థియేటర్ ఓనర్స్‌కి.. సినిమా వాళ్లకి హెల్ప్ చేయండి.. ఇట్లు మీ నాన్న గారి అభిమాని అంటూ చేతులెత్తి మొక్కుతున్న ఎమోజీలను షేర్ చేశాడు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా ట్వీట్లు పెడుతున్నారు. కొందరు బ్రహ్మాజీకి మద్దతుగా ట్వీట్లు పెడుతుంటే.. ఇంకొందరు మాత్రం బ్రహ్మాజీని ఏకిపారేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మాజీ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3H4Mrby
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...