Thursday, 23 December 2021

Pushpa క్రేజ్ ఇదే.. నీ యవ్వ తగ్గేదేల్యా అంటోన్న జడేజ

అల్లు అర్జున్ ఫీవర్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా పుష్ప రాజ్ దుమ్ములేపుతున్నాడు. టాక్ పక్కన పెడితే కలెక్షన్లు మత్రం ఫుల్లుగా వస్తున్నాయి. రెండు వందల కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మొన్నటికి మొన్న ఈ కలెక్షన్ల విషయంలో నోరు జారిన ఉదయ భానుని ఎలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తగ్గేదేల్యా అనే డైలాగ్, మ్యానరిజం వైరల్ అవుతూనే ఉంది. ఆ డైలాగ్, ఆ యాటిట్యూడ్, మ్యానరిజం కాస్తా క్రికెటర్లను కూడా ఆకట్టుకున్నట్టుంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ఎంపికవని రవీంద్ర జడేజా.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నారు. మాసిన గెడ్డంతో పుష్పరాజ్ లుక్‌లో కనిపించిన రవీంద్ర జడేజా.. తగ్గేదేల్యా అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇక పుష్ప టీం రవీంద్ర జడేజా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. పుష్ప రాజ్‌గా రగ్డ్ లుక్‌లోకి మారిన జడేజాను చూసి అంతా షాక్ అవుతున్నారు. మొత్తానికి పుష్ప మాత్రం బాక్సాఫీస్ వద్ద కూడా నీ యవ్వ తగ్గేదేల్యా అని దుమ్ములేపుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ పట్ల చిత్రయూనిట్ అంతా కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందుకే సక్సెస్ ఈవెంట్లు అంటూ వరుసగా పుష్ప టీం సందడి చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qp1NRD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...