Wednesday, 1 December 2021

‘ఎన్టీఆర్‌ది మఖ నక్షత్రం.. రాజకీయాల్లోకి వస్తే సీఎం కావడం ఖాయం.. జయలలిత జాతకం ఎన్టీఆర్ జాతకం ఒక్కటే’

సమంత విడాకులు ఇష్యూతో సినీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి హాట్ టాపిక్ అయ్యారు. సమంత-నాగ చైతన్యలు విడిపోతున్నారంటూ ముందే జోస్యం చెప్పిన ఇతగాడు.. అఖిల్‌కి నిశ్చితార్థం అయినా పెళ్లి జరిగదని చెప్పేశాడు.. ఈ రెండూ అతను చెప్పినట్టే పెటాకులు కావడంతో ఇక అందరి భవిష్యత్‌పై జోతిష్యం చెప్తూ వివాదాస్పదంగా మారారు. చాలామంది సినీ సెలబ్రిటీలకు జోతిష్యం చెప్పే వేణు స్వామి.. పొలిటికల్ పార్టీల భవిష్యత్‌పై కూడా జోతిష్యం చెప్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి బుధమహర్ధశ కొనసాగుతుందని.. 17 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా ఉండబోతున్నారంటూ జోస్యం చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం.. అసలు ఆయనకు రాజకీయాలే కలిసిరావని.. 2024 నాటికి పార్టీయే ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ఉండబోతుందనే దానిపై కూడా జోతిష్యం చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్‌లతో 2024 ఎన్నికలకు వెళ్తే.. అసలు కాంపిటేషన్ లేకుండా పోతుందని జగన్ ఈజీగా గెలుస్తారని చెప్తున్నారు. మరి టీడీపీ తిరిగి అధికారాన్ని చేపట్టాలంటే ఏం చేయాలయ్యా సామే అంటే.. ఉన్నాడుగా అంటున్నారు. ‘‘ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్ అద్భుతంగా ఉంది.. టీడీపీ గెలుపుకి ఉన్న ఒకే ఒక్క మార్గం జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడే కాదు.. రెండేళ్ల క్రితమే చెప్పా.. చంద్రబాబు, లోకేష్ వీళ్లెవ్వరూ కాదు.. ఒక్క జూనియర్ వల్లే టీడీపీ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది అని. 2024లో టీడీపీ చంద్రబాబు, లోకేష్‌లతోనే ఎన్నికలకు వెళ్తే అసలు కాంపిటేషన్ కూడా లేకుండా పోతుంది.. బాలకృష్ణ జాతకం ప్రకారం.. ఆయనకు సీఎం అయ్యే యోగం లేదు. జూనియర్ ఎన్టీఆర్‌కి నూటికి నూరు శాతం ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌ది మఖ నక్షత్రం.. జయలలితది కూడా ఇదే నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్లు రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. ఎన్టీఆర్‌ది చాలా పవర్ ఫుల్ జాతకం. ఆయన రాజకీయాల్లోకి వస్తే తిరుగు ఉండదు’ అంటూ జోతిష్యం చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZFURpF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...