Wednesday, 1 December 2021

రోజాకు అడ్డంగా దొరికిపోయిన వర్ష- ఇమ్మానుయేల్.. కారులో అలా కనిపించి బుక్కయ్యారులే! గుట్టు రట్టు

బుల్లితెరపై కొన్ని జోడీలకు యమ డిమాండ్ ఉంటుంది. అలాంటి జోడీల్లో రష్మీ- సుధీర్, అనసూయ- హైపర్ ఆదిలతో పాటు వర్ష- జోడీ ఉంటుంది. రెగ్యులర్ ప్రోగ్రాములతో పాటు ఈ ఇద్దరూ వేసే స్కిట్స్ బాగా వర్కవుట్ అవుతుంటాయి. చిన్నితెరపై ఈ జోడీ చేసే రచ్చ అంతా ఇంతా అని చెప్పలేం. వీరి ట్రాక్ మీద అందరికీ కాస్త ఇంట్రెస్ట్ కలగడంతో ఈ జోడీని బాగా వాడేస్తూ రొమాంటిక్ స్కిట్స్ వేయించారు. దీంతో వర్ష- ఇమ్మానుయేల్ మధ్య ఏదో నడుస్తుందనే టాక్ ముదిరింది. దీంతో ఇదే అడ్వాంటేజ్‌గా తీసుకొని రష్మీ- సుధీర్‌కు పెళ్లిళ్లు చేసినట్టు వర్ష- ఇమ్మానుయేల్ జోడీని కూడా పెళ్లి పీటలెక్కించారు. అయితే ఈ ఎపిసోడ్ పెద్దగా కిక్కవ్వనప్పటికీ అదే బాటలో ఈ జోడీతో స్కిట్స్ చేస్తున్నారు. 'ఉప్పెన' సినిమాలోని రొమాంటిక్ సీన్స్, జల జలపాతం రొమాంటిక్ సాంగ్ చేయడం లాంటివి కూడా చేసేశారు. అయితే ఈ జోడీ రొమాంటిక్ మూమెంట్స్‌పై రాను రాను బోర్ రావడంతో ఈ మధ్యకాలంలో కాస్త తగ్గించేసినా మళ్ళీ దాన్నే ఫోకస్ చేస్తూ వాళ్ళిద్దరి గుట్టు రట్టు చేసింది జబర్దస్త్ జడ్జ్ . డిసెంబర్ 3న ప్రసారం కాబోతున్న రిలీజ్ చేయగా అందులో వర్ష, ఇమ్మాన్యుయేల్ లతో పాటు యాంకర్ రష్మీ సందడి కనిపించింది. అందరు కలిసి స్కిట్స్ వేస్తూ కడుపుబ్బా నవ్వించారు. అయితే ఇందులో భాగంగా రెండ్రోజుల క్రితం మీరిద్దరు ఎక్కడున్నారని అడుగుతూ వర్ష- ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ తెరపైకి తెచ్చింది రోజా. దీంతో ఆ రోజు నేను షూటింగ్‌లో ఉన్నాను..ఇమాన్యుయేల్ వేరే చోట ఉన్నాడు అని చెప్పడంతో వెంటనే సీక్రెట్ ఫొటో బయట పెట్టేసింది రోజా. కారులో వర్ష- ఇమాన్యుయేల్ ముచ్చట్లు పెట్టుకున్న ఫోటోను చూపించి అసలు మ్యాటర్ అందరి ముందు పెట్టేసింది. దీనిపై కూడా వర్ష రియాక్ట్ అవుతూ.. ఆ రోజు షూట్ జరుగుతుండగా నాకు బాలేదని ఇమాన్యుయేల్‌కు ఫోన్ చేశాను. నేను హాయ్ అని అనే దాంట్లోనే నా మూడ్ అర్థం చేసుకుంటాడు ఇమాన్యుయేల్. అలా అక్కడకు వచ్చాడంటూ ఇమ్మానుయేల్ గురించి చెప్పుకొచ్చింది వర్ష. ఈ సన్నివేశాలతో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ruNBIL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...