Wednesday, 1 December 2021

యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయిన యంగ్ హీరో తమ్ముడు

టాలీవుడ్‌ను విషాద విష‌యాలు ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్‌గా శివ శంక‌ర్ మాస్ట‌ర్‌ను కోల్పోయాం. మంగ‌ళ‌వారం ప్ర‌ముఖ సీనియ‌ర్ గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌న్నుమూశారు. ఈ విషాదాల నుంచి తేరుకోక ముందే టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌మ్ముడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూయ‌డం బాధాక‌రం. క‌డ‌ప జిల్లా చెన్నూరు వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో రామాంజులు రెడ్డి తీవ్ర గాయాలతో క‌న్నుమూశారు. రీసెంట్‌గానే కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా కొత్త సినిమా ప్రారంభ‌మైంది. కొత్త సినిమా ప్రారంభించిన జోష్‌లో ఉన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు ఇప్పుడు త‌మ్ముడి మ‌ర‌ణంఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచ‌యం అయ్యారు. త‌ర్వాత ఆయ‌న క‌థ అందించిన ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం చిత్రం ఇంకా మంచి విజ‌యాన్ని సాధించింది. దీంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా ఇంకా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. రీసెంట్‌గానే కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌న కొత్త చిత్రాన్ని షురూ చేశాడు. అగ్రకథానాయకులతో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ , మత్తు వదలరా వంటి సినిమాను నిర్మించిన క్లాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబి), గోపీచంద మ‌లినేని వంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కులు వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ర‌మేశ్ కాదూరి ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవున్నారు. న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిరంజీవి(చెర్రీ), హేమ‌ల‌త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d8mFWQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...