Wednesday, 15 December 2021

షాకిస్తున్న పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. తగ్గేదే లే! బాహుబలి రికార్డ్ బ్రేక్..

అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తొలి భాగాన్ని ' ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాకు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని తెలిసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 144.90 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 101.75 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఏరియాల వారిగా 'పుష్ప' ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్ నైజాం: 36Cr సీడెడ్: 18Cr ఉత్తరాంధ్ర: 12.25Cr ఈస్ట్ గోదావరి: 8Cr వెస్ట్ గోదావరి: 7Cr గుంటూరు: 9Cr కృష్ణా: 7.5Cr నెల్లూరు: 4Cr ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 101.75 కోట్లు. ఇక కర్ణాటకలో చూస్తే 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ 4 కోట్లు, హిందీ 10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.15 కోట్లు, ఓవర్సీస్ 13 కోట్లు, మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్‌గా 144.90 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బరిలోకి దిగుతోంది. ఇకపోతే టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో ‘పుష్ప' మూవీ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఈ సినిమా కంటే ఎక్కువగా బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే బాహుబలి 1 రికార్డును 'పుష్ప' అధిగమించడం మరో విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m4BXAI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...