Wednesday, 15 December 2021

మీడియాకు అల్లు అర్జున్ క్షమాపణలు.. చెప్పినంత మాత్రాన తగ్గను.. బన్నీ కామెంట్స్ వైరల్

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమా విడుదలకు ఇంకెంతో సమయం కూడా లేదు. రేపు ఒక్క రోజు గ్యాప్ ఉంది. ఆల్రెడీ రేపు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ కూడా పడతాయి. ఇక డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప విడుదల కాబోతోంది. ఈ రోజు క్యూబ్ సంస్థకు పుష్ప సినిమాను అందించినట్టు తెలుస్తోంది. చివరి క్షణం వరకు సినిమా పనులను సుకుమార్ దగ్గరుండి మరీ చూసుకున్నాడట. సుకుమార్ సినిమా పనుల్లో బిజీగా ఉంటే.. ప్రమోషన్స్‌లో బన్నీ బిజీగా ఉన్నాడు. ఇంత వరకు సుకుమార్ మాత్రం బయటకు రాలేదు. సినిమాను రెడీ చేసేందుకు చివరి క్షణం వరకు కష్టపడుతూనే ఉన్నాడు. అలా సుకుమార్ తెర వెనక కష్టపడుతూ ఉంటే.. బన్నీ మాత్రం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అంతటా తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు బన్నీ. నిన్న హైద్రాబాద్, చెన్నైల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బన్నీ, రష్మిక ఇలా టీం మేట్స్ అంతా కూడా క్షణం తీరిక లేకుండా తిరుగుతూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. నేడు అల్లు అర్జున్ కన్నడ మీడియాతో ముచ్చటించేందుకు బెంగళూరు వెళ్లాడు. అయితే ముందుగా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. దీంతో అక్కడి మీడియా బన్నీని నిలదీసింది. ఎందుకు అంత ఆలస్యంగా వచ్చారని అడిగింది. దీనిపై బన్నీ వివరణ ఇచ్చుకున్నాడు. ఈ ప్రెస్ మీట్ ఉందని నాకు తెలియదు.. చివరి క్షణంలో తెలిసింది.. అందుకే ప్రైవేట్ ఫ్లైట్‌లో వచ్చాం.. మంచు ఉండటంతో కాస్త లేట్ అయింది. మీ సమయం వృథా అయినందుకు క్షమాపణలు చెబుతున్నాను అని బన్నీ తన హుందాతనాన్ని ప్రకటించాడు. అయితే తాము సారీ ఆశించడం లేదని మీడియా ప్రతినిధులన్నారు. సారీ చెప్పినంత మాత్రాన తగ్గిపోమని, ఇంకా పెరుగుతామని, మిమ్మల్ని వెయిట్ చేయించాను కదా? సారీ అని బన్నీ అనేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oX9uyF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...