Wednesday, 15 December 2021

గర్వంగా ఫీలయ్యేలా చేస్తా.. వాటిని ఎప్పటికీ మరిచిపోలేను.. తండ్రిని తలుచుకుంటూ అనసూయ ఎమోషనల్

బుల్లితెరపై యాంకర్‌గా మంచి ఫాంలో ఉన్న ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనసూయ తండ్రి సుదర్శన్ రావు గత పది రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గత కొన్నేళ్లుగా బాధపడుతూ వచ్చిన ఆయన డిసెంబర్ 5న తుది శ్వాస విడిచారు. తాజాగా అనసూయ తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. ‘మై మోస్ట్ హ్యాండమ్సెస్ట్ పపాజీ.. నా పనులతో నిన్ను ఎప్పుడూ గర్వంగా ఫీలయ్యేలా చేస్తాను.. నేను నీకు మాటిస్తున్నాను. నువ్ నాకు ఈ జన్మ ఇచ్చినందుకు నా గ్రాటిట్యూడ్‌ని ఎలా చెప్పాలో కూడా మాటలు సరిపోవడం లేదు.. ఏం తినాలి. ఎలా ఉండాలో అనే పాఠాలను మాకు ఈ జీవితంలో నేర్పించావు.. మమ్మల్ని మాలా తీర్చి దిద్దావ్.. మీతో ఉన్న సమయాన్ని, గడిపిన క్షణాలను ఎప్పుడూ మరిచిపోలేను.. అర్దరాత్రుల్లు మీరు మాకు ఇచ్చిన సర్ ప్రైజ్ కానుకలు మరిచిపోం. ఆ పొసెసివ్ నెస్, ,ఆ కోపం అన్నీ మాకు గుర్తున్నాయి.. అంతులేని ప్రేమను చూశాం.. మాకు నచ్చినట్టు బతికేందుకు ఎన్నో పాఠాలు నేర్పావ్.. ధైర్యవంతురాలిగా మమ్మల్ని పెంచావ్.. టైగర్ దర్శన్ పెహల్వాన్‌గానే అందరూ నిన్ను గుర్తు పెట్టుకుంటారు.. మీరు తండ్రిగా ఎంతో గొప్పగా బాధ్యతలును నెరవేర్చారు అని మీరు బతికి ఉన్నప్పుడే చెప్పాలని అనుకున్నాను. ఈ ప్రపంచం ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మమ్మల్ని మాలానే పెంచారు.. మీరు లేకపోతే మా జీవితం ఎలా ఉండేదో కూడా ఊహించుకోలేకపోతోన్నాను.. మేం ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం మాత్రం మీరే. మీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ అనసూయ ఎమోషనల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dPpaxP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...