Tuesday, 14 December 2021

ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ.. అది చేయలేకపోతోన్నానంటూ సమంత ఎమోషనల్

ఆరోగ్యంపై వచ్చిన రూమర్లు అందరికీ తెలిసిందే. కాస్త నలతగా ఉందని, దగ్గు వస్తోందని పరీక్షలు చేయించుకుని సమంత రెస్ట్ తీసుకుంటుందట. కానీ సోషల్ మీడియాలో మాత్రం సమంతకు కరోనా వచ్చిందంటూ రకరకాల రూమర్లు వ్యాప్తి చెందాయి. అంతకు ముందు రోజే సమంత కడప, తిరుమలకు కూడా వెళ్లింది. అయితే సమంత మీద వచ్చిన రూమర్లను ఆమె మేనేజర్ ఖండించాడు. సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్లను నమ్మొద్దని సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. సమంత కాస్త అస్వస్థతకు గురైందని, పరీక్షలు చేయించుకున్న అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోందని చెప్పుకొచ్చాడు. సమంత పూర్తిగా క్షేమంగానే ఉన్నారంటూ అభిమానులకు అసలు విషయాన్ని చెప్పాడు. అయితే తాజాగా సమంత ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. అందులో సమంత బెడ్డు మీదే పడుకుని కనిపిస్తోంది. కానీ తన ఫేస్‌ను మాత్రం సమంత చూపించలేదు. తన బెడ్డు మీద హష్, సాషాలు పడుకుని ఉన్నారు. మామూలుగా అయితే వాటిని ఆడిస్తూ కనిపించే సమంత.. ఇప్పుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అలా వదిలేసింది. దీంతోో అవి రెండు సమంత బెడ్డు మీద అలా కూర్చుని ఉన్నాయి. ఏమనుకోకండి.. ఈ ఒక్క రోజు కాస్త ఆరోగ్యం బాగా లేదు.. అందుకే మిమ్మల్ని ప్రేమగా చూసుకోలేకపోతోన్నాను అంటూ సమంత ఎమోషనల్ అయింది. మొత్తానికి సమంత ఆరోగ్యం మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో ఏమీ లేదని ఇలా చెప్పకనే చెప్పేసింది. సమంత ప్రస్తుతం ఊ అంటావా ఊ ఊ అంటావా? అనే పాట వివాదంతో మార్మోగిపోతోంది. ఆమె మీద పురుష సంఘాలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EZbTyv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...