నేటితరం ఆడియన్స్ సినిమాలకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. స్టార్ హీరోలిద్దరు ఒకే తెరపై కనిపించడాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బడా నిర్మాణ సంస్థలు కోట్లలో బడ్జెట్ కేటాయించి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు రూపొందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో డీవీవీ దానయ్య RRR సినిమా నిర్మిస్తుండగా.. అదే బాటలో వెళుతూ మెగా, నందమూరి అభిమానుల కోరిక తీర్చే స్కెచ్చేసిందట సంస్థ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా భారీ చిత్రాలతో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలకృష్ణ, కాంబోలో భారీ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్. ఇటీవల జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీనిపై చిన్న హింట్ ఇచ్చారు మైత్రి నిర్మాతలు. దీంతో ఒక్కసారిగా ఈ టాపిక్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి- కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండొచ్చనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరోలుగా నేటికీ వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. ఎవరికి వారు బడా ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ కుర్ర హీరోలకు పోటీనివ్వడమే గాక ఇండస్ట్రీకి బాక్సాఫీస్ హిట్స్ అందిస్తున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణ 'అఖండ' సినిమాతో భారీ విజయం ఖాతాలో వేసుకోగా.. మెగాస్టార్ చిరంజీవి ''ఆచార్య, భోళా శంకర్'' సహా మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ చిరంజీవి- బాలకృష్ణ కాంబోలో భారీ మల్టీస్టారర్ అనే టాక్ బయటకు రావడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని కుతూహల పడుతున్నారు. సో.. చూడాలి మరి చిరంజీవి- బాలకృష్ణ ఒకే తెరపై సందడి చేసే ముహూర్తం ఎప్పుడొస్తుందనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DXa3wG
v
No comments:
Post a Comment