Saturday, 11 December 2021

ఎన్టీఆర్‌ను అక్కడ గిల్లేసిన చరణ్.. వీడియో షేర్ చేసిన స్టార్ కమెడియన్

సినిమాల విష‌యంలో ఒకానొక సంద‌ర్భంలో మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య గ‌ట్టి పోటీనే న‌డిచింది. పోటా పోటీగా సినిమాల‌ను చేయ‌డం, వాటి క‌లెక్ష‌న్స్ ఇలా తెలియ‌ని ఓ పోటి ఎప్పుడూ ఉండేది. ఇక వారి ఫ్యాన్స్ కూడా సినిమాల రిలీజ్‌ల స‌మ‌యంలో గొడ‌వ‌లు ప‌డుతుండేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలంద‌రూ క‌లిసి పోతున్నారు. పార్టీలు, సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. అదే క్ర‌మంలో దర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మెగా హీరో అయిన రామ్‌చ‌ర‌ణ్‌, నంద‌మూరి హీరో అయిన ఎన్టీఆర్‌ల‌తో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమాయే RRR. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌గానే ఇద్ద‌రూ మాస్ హీరోలు.. తెలియ‌ని పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది. మ‌రి అలాంటప్పుడు వారిద్ద‌రినీ బ్యాలెన్స్ చేస్తూ రాజ‌మౌళి సినిమాను ఎలా తెర‌కెక్కిస్తారా? అని అంద‌రూ అనుకున్నారు. అయితే అంద‌రి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ రాజ‌మౌళి సినిమాను రెండు ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల మ‌ధ్య ఉండే భావోద్వేగాలు క‌ల‌యిక‌గా తెర‌కెక్కించారు. ఆ రెండు ఫిక్ష‌నల్ పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఒదిగిపోయారు. ఈ సినిమా మేకింగ్ స‌మయంలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ మ‌ధ్య ఉన్న అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఎంత బ‌ల‌ప‌డిందంటే ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడుకోవ‌డం, భోజ‌నం చేయ‌డం.. ఒక‌రినొక‌రు ఆట ప‌ట్టించ‌డం..వంటి ప‌నుల‌తో స్నేహం మ‌రో లెవ‌ల్‌కు చేరింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి RRR ప్రెస్ మీట్‌లోనూ ప్ర‌స్తావించారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో మ‌రో గ‌మ్మ‌త్తైన విష‌యం జ‌రిగింది. ఫొటోగ్రాఫ‌ర్స్‌కు రామ్ చ‌ర‌ణ్‌, క‌లిసి ఫోజులు ఇచ్చేట‌ప్పుడు ఎన్టీఆర్‌కు చ‌ర‌ణ్ చిన్న జ‌ర్క్ ఇచ్చాడు. ఎన్టీఆర్ న‌డుం మీద గిల్ల‌డ‌మే, చ‌క్కిలిగింత పెట్ట‌డ‌మో ఏదో చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఉలిక్కిప‌డి ప‌క్క‌కు జ‌రిగి న‌వ్వేశాడు. దాంతో చ‌ర‌ణ్ కూడా న‌వ్వేశాడు. ఈ టీజింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. వీడియో చూసిన మెగా, నంద‌మూరి ఫ్యాన్స్ కూడా చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న బాండింగ్ చూసి సంతోష ప‌డుతున్నారు. ఈ వీడియోను ప్ర‌ముఖ స్టార్ కమెడియ‌న్ వెన్నెల కిషోర్ షేర్ చేసి.. న‌వ్వుతున్న ఎమోజీని కూడా షేర్ చేయ‌డం విశేషం. ఇక RRR సినిమా విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీగా RRRను నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రాజ‌మౌళి తెరకెక్కించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో అంద‌రూ సినిమా గురించి ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lUY5O4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...