Saturday, 11 December 2021

న‌య‌న‌తార నయా వ్యాపారం

ద‌క్షిణాదిన నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార ఒక‌రు. ఒక వైపు స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుందీ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌. సినిమాల విష‌యంలో న‌య‌న తార‌కు ఉన్న క్రేజ్‌ను బేస్ చేసుకుని ఆమె అడిగినంత ఇవ్వ‌డానికి కూడా నిర్మాత‌లు రెడీ అనే అంటున్నారు. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే ద‌క్షిణాది హీరోయిన్స్‌లో న‌య‌న‌తార నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌యం ఏంటంటే.. న‌య‌న తార‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చినా, ప్ర‌మోష‌న్స్‌కు రాదు. సినిమాకు సైన్ చేసేట‌ప్పుడు తాను ప్ర‌మోష‌న్స్‌కు రాన‌ని, అలాగైతేనే సినిమాకు సంత‌కం చేస్తాన‌ని కండీషన్ పెట్టి మ‌రీ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందీమె. సినిమాల విష‌యంలో ఇంత క్రేజ్ ద‌క్కించుకున్న న‌య‌న తార‌.. ఇప్పుడు మ‌రో కొత్త అడుగు వేయ‌నుంది. ఇంత‌కీ న‌య‌న తార ఎలాంటి స్టెప్ వేయ‌నుందో తెలుసా.. కొత్త బిజినెస్‌లోకి న‌య‌న తార అడుగు పెట్టింది. అదే ‘ది లిప్ బామ్ కంపెనీ’ ఇదొక బ్యూటీ రిటైల్ బ్రాండ్. చర్మ వ్యాధులను నయం చేసే స్పెషలిస్ట్ రేణితా రాజన్‌తో క‌లిసి న‌య‌న ఈ బిజినెస్‌ను ప్రారంభించింది. ‘న‌య‌నతార‌తో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. త‌న‌పై న‌మ్మ‌కం ఉంది. ఈ బ్యూటీ రిటైల్ బ్రాండ్ ది లిప్ బామ్‌కు సంబంధించిన గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. కోవిడ్ ప్ర‌భావం కార‌ణంగా కాస్త ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు ఇప్పుడు కొత్త రిటైల్ బ్రాండ్‌ను స్టార్ట్ చేస్తున్నాం’ అంటూ రేణితా రాజ‌న్ తెలిపారు. న‌య‌న‌తార వ్యాపారం రంగంలోకి అడుగు పెట్ట‌డం ఇదేమీ కొత్త కాదు. ఎందుకంటే ఇది వ‌ర‌కు ఆమె త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ఛాయ్ వాలే బేవ‌రేజ్ బ్రాండ్‌లో పెట్టుబ‌డులు పెట్టింది. అలాగే రౌడీ పిక్చ‌ర్స్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి సినిమాల‌ను నిర్మిస్తోంది. వీట‌న్నింటితో పాటు ఇప్పుడు రిటైల్ బ్యూటీ బ్రాండ్‌లోకి అడుగు పెట్టింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. న‌య‌న తార తెలుగులో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న గాడ్ ఫాద‌ర్‌లో ఆయ‌న‌కు చెల్లెలు పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో షారూక్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలోనూ న‌య‌న తార హీరోయిన్‌. అలాగే త‌న ల‌వ‌ర్ విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కాత్తువాక్క‌ల్ రెండు కాద‌ల్ అనే సినిమాలోనూ స‌మంత‌తో క‌లిసి న‌టిస్తోంది న‌య‌న తార‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lRANsk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...