Monday, 6 December 2021

సిరివెన్నెల రాసిన చివరి పాట.. సిగ్గుపడుతున్న నాని, సాయి పల్లవి!

నటించిన సినిమా మీద మంచి అంచనాలున్నాయి. నాని నటించిన గత రెండు చిత్రాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. వీ, టక్ జగదీష్ అంటూ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ అంటూ నాని సందడి చేయబోతోన్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న నాని రాబోతోన్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే. టైటిల్ సాంగ్, రొమాంటిక్ పాటలు విడుదల కాగా వాటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ నుంచి మూడో పాట రాబోతోంది. ఈ పాటకు చాలా ప్రత్యేకత ఉంది. స్వర్గీయ చివరగా రచించిన పాట ఇది. అంతేకాకుండా అంటూ ఈ పాట సాగుతుంది. అలా ఈ పాటపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఈ పాట గురించి దర్శకుడు చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ పాటను రాయడం వెనుకున్న కథను రాహుల్ వివరించాడు. నవంబర్ 3న సిరివెన్నెల గారు కాల్ చేశారని చెప్పుకొచ్చాడు, ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతోన్నాను అని అన్నారట. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని ఎంతో రిక్వెస్ట్ చేశారట. మరుసటి రోజు ఉదయాన్నే ఆయన ఫోన్ చేసి పల్లవి చెబుతాను రాసుకోండని అన్నారట. ఆ లైన్స్‌లో సిరివెన్నెల అని రావడంతో.. ఇదే తన చివరి పాట అవుతుందేమోనని అన్నారట. చివరకు అలానే జరిగింది. సిరివెన్నెల రాసిన చివరి పాటగా ‘సిరివెన్నెల’ నిలిచింది. ఈ పాట రేపు విడుదల కాబోతోంది. డిసెంబర్ 7 సాయంత్రం నాలుగు గంటలకు పాట విడుదల కాబోతోందంటూ వదిలిన పోస్టర్‌లో నాని, సాయి పల్లవిలి సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DmTw4Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...