Monday, 6 December 2021

Yashoda : కొత్త అడుగు వేసిన సమంత.. మొత్తానికి ఆరంభం

ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సూపర్ హిట్ అవ్వడం, అందులో రాజీ పాత్రలో సమంత అదరగొట్టేయడంతో మంచి క్రేజ్ వచ్చింది. అలా సమంత ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి ప్రాజెక్ట్‌ల్లోనే నటించాలని ఆశపడుతోంది. ఇంతకముందు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచనల్లో ఉండటంతో బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించిందట. ఈ విషయాన్ని సమంత స్నేహితురాలు సాధన సింగ్, నీలిమ గుణ తెలిపారు. ఇక ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో సమంత తన ఫుల్ ఫోకస్‌ను సినిమాల మీదే పెట్టేసింది. సమంత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ఓకే చేస్తోంది. ఇక ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే సమంత నటిస్తోంది. ఓ బేబీ నిర్మాతతో మరోసారి సమంత జతకట్టేసింది. ఈ సారి హాలీవుడ్ స్థాయిలో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో సమంత ఓ బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోందట. ఇక అది అలా ఉంటే.. తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభమైంది. దసరా రోజు సమంత రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌లో మరో చిత్రాన్ని సమంత ఓకే చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో వాటిని తమిళ, తెలుగు భాషల్లోనే తీయాలని భావించారు. కానీ వాటిని కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లోనే తెరకెక్కిస్తున్నారు. అంటూ సమంత కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. హరి నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31zSbdI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...