Monday, 6 December 2021

Pushpa Trailer : బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెనకడుగు వేసిన మైత్రి మూవీస్

అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతోన్న మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. కానీ మైత్రీ మూవీస్, పుష్ప యూనిట్ మాత్రం బన్నీ అభిమానులు నిరాశలో ముంచెత్తింది. నేటి సాయంత్రం 6:03 గంటలకు వదులుతామన్న ట్రైలర్‌ను చివరి నిమిషంలో వాయిదా వేశారు. దీంతో బన్నీ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగానే వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చారు. మళ్లీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చెబుతామని, అప్పటి వరకు స్టే ట్యూన్ అంటూ ఓ ట్వీట్ పడేశారు. ఇలా చివరి నిమిషంలో వాయిదా వేయడంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోతోన్నారు. మైత్రీ మూవీస్‌ను దారుణంగా ఏకిపారేస్తున్నారు. ఉదయం నుంచి తెగ హడావిడి చేస్తూ వచ్చావ్.. ఇప్పుడు ఇలా చేశావ్ ఏంట్రా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇలాంటివేవో చేస్తావని ముందే ఊహించాం అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తావ్ రా అంటూ ఒక్కొక్కరు విరుచుకుపడుతున్నారు. ఇక రేపు సినిమా విషయంలోనూ ఇలానే చేస్తావా? అంటూ నిలదీస్తున్నారు. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ మాత్రం మంచి ఆకలి మీదున్నారు. ట్రైలర్‌తో దుమ్ములేపేద్దామని చాలానే ఆశలు పెట్టుకున్నట్టున్నారు. కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లేసింది పుష్ప యూనిట్. అసలే ట్రైలర్ టీజ్ పేరుతో వదిలిన చిన్న పాటి వీడియోలో బన్నీ విధ్వంసం చూపించాడు. ట్రైలర్ మీద అంచనాలు పెంచేశాడు. తీరా ట్రైలర్ కోసం అందరూ రెడీగా ఉంటే.. తాపీగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో సాధారణ ప్రేక్షకులు సైతం మైత్రి మీద ఫైర్ అవుతున్నారు. మరి నేటి రాత్రి ఈ ట్రైలర్ వస్తుందా? లేదా? రేపటికి వాయిదా వేస్తారా? అన్నది చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lEb1aK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...