Friday, 3 December 2021

ఓ గంట సేపు చేశాక నార్మల్ అయ్యాను.. వామ్మో శృతి హాసన్ రచ్చ

ప్రస్తుతం ముంబైలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. శ్రుతీ హాసన్ తన ప్రియుడు శంతను హజారికతో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. మొన్నటి వరకు అక్షర హాసన్ కూడా ఈ ఇద్దరితోనూ ముంబైలోని ఇంట్లో ఉంది. ముగ్గురూ కలిసి బాగానే రచ్చ చేశారు. ఓ వైపు కమల్ హాసన్ కరోనాతో బాధపడుతూ ఉంటే.. శ్రుతీ హాసన్, అక్షర హాసన్ మాత్రం రచ్చ రచ్చ చేశారు. శ్రుతీహాసన్‌కు పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. అసలు శ్రుతీ హాసన్ కెరీర్ మొదలైందే సంగీత దర్శకురాలిగా. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ శ్రుతీ హాసన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక నటిగా మారిన తరువాత ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వైపు కాన్సన్‌ట్రేషన్ తగ్గించేసింది. తాజాగా శ్రుతీ హాసన్ డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఓ గంట సేపు డ్యాన్స్ చేశాక.. నార్మల్ అయ్యాను అంటూ తెలిపింది. మొత్తానికి శ్రుతీ హాసన్ మాత్రం రోజూ వర్కవుట్లతో బిజీగా ఉంటుంది. అలా ఈ రోజు ఓ గంట పాటు డ్యాన్స్ చేసి తన ఒత్తిడిని తగ్గించుకున్నట్టుంది. కెరీర్ పరంగా శ్రుతీ హాసన్ ఇప్పుడు కాస్త వెనకబడి ఉంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. ఈ ఏడాది రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ చిత్రంలో శ్రుతీ హాసన్ మెరిసింది. క్రాక్ హిట్ అవ్వడంతో ఆమె కెరీర్ కాస్త ఊపందుకుంది. అందుకే ప్రభాస్ పక్కన సలార్‌లో నటించే చాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే తమిళంలో మాత్రం శ్రుతీ హాసన్ కెరీర్ ఆశాజనకంగా లేదు. విజయ్ సేతుపతితో చేసిన లాభం సినిమా శ్రుతీ హాసన్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్‌లో శ్రుతీ హాసన్‌కు ఆఫర్లు లేనట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IlKNE2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...