Friday, 3 December 2021

దాక్షాయణి నోట్లో బ్లేడు.. మంగళం శీను మీదికెక్కి అనసూయ అరాచకం.. షేక్ చేస్తున్న వీడియో

సుకుమార్, కాంబినేషన్‌లో సినిమా అంటే అందరికీ ఓ మోస్తరు అంచనాలుంటాయి. ఇక రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ ఓ వైపు.. అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన అల్లు అర్జున్ మరో వైపు. అలా సుకుమార్, అల్లు అర్జున్ కలిసి మూడో సారి అంటూ మ్యాజిక్ చేసేందుకు వస్తున్నారు. డిసెంబర్ 17న రాబోతోన్న పుష్ప ది రైజ్ సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు, టీజర్‌ సినిమా మీద అంచనాలను పెంచేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ మంచి స్వింగ్ మీదున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాను జనాల్లోకి ఇంకా తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ట్రైలర్‌ను డిసెంబర్ 6న విడుదల చేయబోతోన్నారు. ఈక్రమంలో కాస్త ముందుగానే ఓ చిన్న శాంపిల్‌ను వదిలారు. పుష్ప ట్రైలర్ టీజ్ పేరిట వదిలిన వీడియోలో పుష్ప రాజ్ ప్రపంచం కనిపించింది. ఇక ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక మీద రెండు షాట్లు కనిపించాయి. ఇక దాక్షాయణి కారెక్టర్‌లో మీద అదిరిపోయే షాట్ పడింది. మంగళ శీను కారెక్టర్‌ను పోషిస్తున్న సునీల్ మీద అనసూయ తన కోపాన్ని చూపించేస్తోంది. అనసూయ తన నోట్ల బ్లేడు పెట్టుకుని కనిపించింది. చూస్తుంటే సునీల్ పాత్రను అంతం చేస్తుందా? అనే అనుమానాలు కలిగించేస్తోంది. పుష్ప సినిమాలో సునీల్ భార్యగా అనసూయ నటించిందా?. అలా ఎందుకు మీదకు ఎక్కేసింది? ఏం చేయబోతోంది? మంగళం శ్రీను పాత్రకు ముగింపు పలుకుతుందా? అంటూ ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అనసూయ మీద ఫుల్ ట్రోల్స్ జరుగుతున్నాయి. మొత్తానికి దాక్షాయణిగా అనసూయ మాత్రం అరాచకాన్ని సృష్టిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xOLDnT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...