Friday, 3 December 2021

ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు!.. సోదరుడి మరణంపై హీరో ఎమోషనల్

రాజా వారు రాణి వారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతకు ముందు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో దుమ్ములేపేశాడు. అలా యూట్యూబ్ నుంచి వెండితెరపైకి కిరణ్ అబ్బవరం ఎదిగాడు. ఈ ఏడాది ఎస్ఆర్ కళ్యాణమండపం అంటూ మంచి హిట్ కొట్టేశాడు. అలా మొత్తానికి కిరణ్ అబ్బవరం మాత్రం మంచి ఫాంలోకి వచ్చాడు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సెబాస్టియన్, సమ్మతమే అంటూ రెడీ అవుతున్నాడు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. సోదరుడి మరణం సంభవించడంతో కిరణ్ ఎమోషనల్ అయ్యాడు. రేయ్‌ కిరణ్‌.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరం అయినా ఏదో ఒకటి గట్టిగా సాధించాలి రా అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. తన లగ్జరీలను శాక్రిఫైజ్ చేశాడు నన్ను హీరోగా చూడటం కోసం.. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అని అనే టైంకి అతను లోకాన్ని విడిచి వెళ్లాడు. తను ఎప్పుడూ అడిగే వాడు.. నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావ్ రా అందరికీ అని.. ఏదైనా గట్టిగా సాధించిన తరువాత పరిచయం చేద్దామని అనుకున్నా కానీ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు.. నా వెనక ఉన్నది మా అన్న ‘అబ్బవరం రామాంజులు రెడ్డి’. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దయచేసి అందరూ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లుంటారు. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు అంటూ కిరణ్ ఎమోషనల్ అయ్యాడు. ఇది విని చాలా షాకింగ్‌గా అనిపించింది. అయినా ఇప్పుడు నీకు ఎంతో మంది సోదరులున్నారు.. అయినా కూడా ఇది పూడ్చలేని లోటు..పైనుంచి మీ అన్న నిన్ను చూస్తూనే ఉంటాడు.. అని తరుణ్ భాస్కర్ కామెంట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GrYNdF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...