Saturday, 4 December 2021

పవర్ స్టార్ తనయుడా? మజాకా?.. తల్లి కోరిక తీర్చిన అకీరా నందన్

పుట్టిన రోజు నేడు (డిసెంబర్ 4). ఏ కొడుక్కి అయినా కూడా తల్లి కోరికను నెర వేర్చడం కంటే ముఖ్యమైన పని ఏంటుంది. అలా రేణూ దేశాయ్ అడిగిన కోరికను తీర్చేశాడు. అకీరా మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. అటు బాస్కెట్ బాల్ ఆడతాడు.. ఇటు చదువుల్లో ఫస్ట్ ఉంటాడు. ఇక ఆర్ట్స్ (కళలు) అంటే మరింత మక్కువ. సంగీతం మీద పట్టుసాధించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోను చూస్తే అకీరా టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. శుక్రవారం నాడు పాడిన పాటను, ప్లే చేసిన గిటార్ వీడియోను షేర్ చేసింది. ఆద్య టాలెంట్ గురించి గొప్పగా చెప్పింది. ఇక ఇది వరకే ఎన్నో సార్లు అకీరా నందన్ పియానో వాయించే వీడియోలను రేణూ దేశాయ్ షేర్ చేసింది. అయితే తాజాగా మరోసారి అకీరా నందన్‌ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తల్లిగా రేణూ దేశాయ్ మురిసిపోయింది. నెల రోజుల క్రితం అకీరా నందన్‌ను ఓ కోరిక కోరిందట రేణూ దేశాయ్. తనకు ఎంతో ఇష్టమైన పాటను తన బర్త్ డే రోజున పియానో మీద ప్లే చేసి వినిపించమని అడిగిందట. దీంతో నేడు ఆ పాటను వినిపించేశాడు. ఇంతకంటే మంచి గిఫ్ట్‌ ఇంకొకటి ఉండదంటూ రేణూ దేశాయ్ తన కొడుకుని చూసి మురిసిపోతోంది. నా ఈ జీవితంలో నాకు ఇలాంటి పిల్లలు దొరకడం వరం, అదృష్టమన్నట్టుగా రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది. మొత్తానికి ఆద్య, అకీరా నందన్‌లు మాత్రం సంగీతం సరిగమలు నేర్చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో కింద పవర్ స్టార్ అభిమానులు కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఎంతైనా పవర్ స్టార్ తనయుడు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31v95u0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...