Monday, 6 December 2021

ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే!.. మంచు లక్ష్మీ విన్యాసాలు వైరల్

సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. మంచు లక్ష్మీ మీద జరిగే ట్రోల్సింగ్స్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు లక్ష్మీ ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వెళ్తోన్నట్టుంది. ఆ మధ్య ఆహా కోసం చేసిన కుకింగ్ షో మళ్లీ పత్తా లేకుండా పోయింది. ఆహా భోజనంబు అంటూ మంచు లక్ష్మీ బాగానే రచ్చ చేసింది. కానీ ఇప్పుడు ఆ షో ఆగిపోయింది. మంచు లక్ష్మీ కూడా తన కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అయితే మంచు లక్ష్మీ మాత్రం తమిళ సినిమా కోసం బాగానే కష్టపడుతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మంచు లక్ష్మీ ఓ కొత్త విద్యను నేర్చుకుంటోంది. ఇది సినిమా కోసమా? అన్నది తెలియడం లేదు. కానీ తాజాగా తన ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అందులో ఏదైనా కొత్తది నేర్చుకుంటుంటే వచ్చే ఆనందం వేరు.. కేరళలో పుట్టిన అతి ప్రాచీనమైన విద్య. 300 బీసీ శకంలో ఈ విద్య పుట్టింది.. మాన్ స్టర్స్ కోసం ఈ విద్యను నేర్చుకుంటున్నాను. పగలు రాత్రి అని తేడా లేకుండా క్రిష్ణ దాస్, ఆయన కూతురు కావ్య నాయర్ వద్ద ఈ విద్యను నేర్చుకుంటున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో మంచు లక్ష్మీ కలరిపట్టు విద్యను బాగానే నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. కలరి పట్టు మీద ఇది వరకు కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ మధ్యే సాయి పల్లవి కూడా కలరి విద్య నేపథ్యంలో ఓ సినిమాను చేసిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Duayy3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...