Monday, 6 December 2021

Pushpa Trailer : నీయవ్వ తగ్గేదేలే అంటోన్న బన్నీ.. సునీల్ బీభత్సం.. అనసూయ అలా!

సుకుమార్ కలిసి ఎలా మ్యాజిక్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇది వరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య 2లు ఒకెత్తు అయితే.. ఇప్పుడు రాబోతోన్న పుష్ప సినిమా మరో ఎత్తు. పుష్ప ది రైజ్ అంటూ మొదటి పార్ట్‌ను ఈ డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను పెంచేశారు. తాజాగా ఈ చిత్రంలోని ట్రైలర్‌ను విడుదుల చేశారు. మామూలుగా అయితే ఈ సాయంత్రం ఆరుగంటల మూడు నిమిషాలకే ట్రైలర్ రావాల్సింది. కానీ టెక్నికల్ ఇష్యూల వల్ల రాత్రి తొమ్మిది ప్రాంతంలో వచ్చింది. ఇక ఈ ట్రైలర్‌లో సుకుమార్ ఎన్నో హింట్లు వదిలాడు. మాస్‌కు పిచ్చెక్కించేలా ట్రైలర్‌ను కట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ మ్యానరిజం అంతా ఒకెత్తు అయితే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం పీక్స్‌లో ఉన్నాయి. ఇక ప్రతీ ఒక్క పాత్రను ఇందులో పరిచయం చేశాడు సుకుమార్. మరీ ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్, , పాత్రలకు సంబంధించి వదిలిన హింట్లు మాత్రం మామూలుగా లేవు. మంగళం శీను పాత్రలో సునీల్, అతని భార్యగా దాక్షాయణి పాత్రలో అనసూయ కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో అనసూయకు డైలాగ్స్ లేకపోయినా కూడా కొన్ని షాట్లలో కనిపించింది. సునీల్ మీదకు ఎక్కి బీభత్సం సృష్టించింది. ఇక సునీల్‌కు చివర్లో వార్నింగ్ ఇచ్చే షాట్‌లో అనసూయ అలా కనిపించింది. యాక్షన్ సీక్వెన్స్‌లోని ఓ షాట్‌లో అనసూయ కనిపించింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌.. వెనకాల సునీల్ నగ్నంగా కూర్చున్నట్టు కనిపిస్తోంది. పుష్ప.. పుష్ప రాజ్ నీ యవ్వ తగ్గేదేలే అని బన్నీ చెప్పిన తీరుకు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ ప్రపంచం నీకు గన్ను ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవరి యుద్దం వారిదే అంటూ బన్నీ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్ అదిరిపోయాయి. పుష్ప పార్టీ ఎప్పుడు అంటూ ఫాహద్ ఫాజిల్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ అదిరిపోయింది. ఇక శ్రీవల్లి పుష్ప మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ఉందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన పుష్ప డిసెంబర్ 17న దుమ్ములేపేయబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pptskM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...