Monday, 6 December 2021

అది ఎంతో విలువైనది!.. ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్ వైరల్

సోదరి వేడుకలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గత నాలుగు రోజుల క్రితం ట్రాన్స్ జెండర్లను పెళ్లి వేడుకలకు ఉపాసన తీసుకొచ్చింది. వారితోనే ఈ పెళ్లి వేడుకులను ప్రారంభింపజేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి అమన్ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. దోమకొండలో పెళ్లి వేడుకలు అదిరిపోయాయి. అయితే ఉపాసనతో పాటు రామ్ చరణ్ కూడా ఈ పెళ్లి వేడుకల్లో ముందే పాల్గొన్నాడు. నిన్న జరిగిన పెళ్లి ఈవెంట్లో రామ్ చరణ్ రచ్చ చేశాడు. ఇక ఈ పెళ్లిలోనూ సంగీత్ ఈవెంట్ కోసం ఆనీ మాస్టర్‌నే తీసుకున్నట్టు తెలుస్తోంది. నిహారిక పెళ్లి కోసం సంగీత్ ఏర్పాట్లను ఆనీ మాస్టర్ నిర్వహించింది. ఇక ఇప్పుడు అనుష్ పాల పెళ్లికి సైతం ఆనీ మాస్టర్‌ను నియమించేశాడు రామ్ చరణ్. తాజాగా ఉపాసన తన సోదరి పెళ్లి సమయంలో తన వివాహా విశేషాలను గుర్తుకు చేసుకుంది. ఈ క్రమంలో నాడు తన పెళ్లి ఏర్పాట్లు, పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తులను గుర్తుకు చేసుకుంది. ఇప్పుడు కూడా అవే దుస్తులను వేసుకున్నానని ఉపాసన తెలిపింది. దుస్తులను పదే పదే వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అందులో నాకు గర్వంగా ఉంటుంది. క్వాలిటీ ఉన్న వస్త్రాలను షాపింగ్ చేయడం నాకు ఇష్టం. దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి.. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండుగ సెలెబ్రేషన్స్ వస్త్రాలను రీ క్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్స్ అని ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు బ్యూటీఫుల్ అంటూ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/304kb9e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...