Monday, 13 December 2021

నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ప‌నులు చేయ‌ను.. అందుకే ! : నాగ చైత‌న్య‌

ప్రేమించి, పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న స్టార్స్ అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ విడిపోయిన సంగ‌తి తెలిసిందే. మ‌న‌స్ప‌ర్ద‌ల‌తో విడిపోయిన వీరివురూ ఎక్క‌డా ఎందుకు విడిపోయామ‌నే సంగ‌తిని చెప్ప‌నేలేదు. స‌మంత అయితే నాగ చైత‌న్య‌తో విడాకుల‌ గురించి ప్ర‌స్తావన వ‌చ్చిన‌ప్పుడు ఇప్ప‌టికే దాని గురించి మాట్లాడాన‌ని, ఇకపై మాట్లాడ‌టం అన‌వ‌స‌రం అని అనుకుంటున్న‌ట్లు చెప్పేసింది. కానీ నాగ‌ చైత‌న్య మాత్రం త‌న డివోర్స్ సంబంధిత విష‌య‌మై ఎక్క‌డా డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడ‌లేదు. మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. అయితే చైత‌న్య‌, సామ్‌కి సంబంధించిన ఏదో ఒక వార్తనో, వీడియోనో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒక‌టి నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. అదేంటంటే.. చైత‌న్య ఇంట‌ర్వ్యూకి సంబంధించిన వీడియో క్లిప్‌. అందులో ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి చైన‌త్య‌ను ఎలాంటి పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తి చూప‌రు? అని ప్ర‌శ్నించారు. దానికి నాగ‌చైత‌న్య మాట్లాడుతూ ‘నేను అన్నీ త‌ర‌హా పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఎప్పుడూ సిద్ధ‌మే. అయితే నేను చేసే సినిమా కానీ, పాత్ర కానీ నా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదు. కానీ నా కుటుంంబంపై ప్రభావం చూపితే మాత్రం చేయనని చెప్పేస్తాను’ అన్నారు. ఈ వీడియో చూసిన గుస గుస రాయుళ్లు మాత్రం చైత‌న్య ఇన్ డైరెక్ట్‌గా స‌మంత‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య‌లు చేశారని మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది లవ్ స్టోరి చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా పూర్తి చేశారు. అలాగే ఆమిర్ ఖాన్ చేస్తోన్న లాల్ సింగ్ చద్దా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు తండ్రి నాగార్జున‌తో క‌లిసి బంగార్రాజు సినిమాను పూర్తి చేస్తున్నారు. మ‌రో వైపు డైరెక్ట‌ర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఓ హారర్ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Kzftz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...