Monday, 13 December 2021

Samantha ఆరోగ్య పరిస్థితిపై మేనేజర్ క్లారిటీ.. AIG హాస్పిటల్లో టెస్ట్‌లు

సమంతకు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ ఎఐజీలో చేరిక.. అంటూ నెట్టింట్లో క్షణాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేయసాగారు. సమంతకు కరోనా అంటూ పుకార్లు లేవనెత్తారు. దీంతో వెంటనే సామ్ టీం రంగంలోకి దిగింది. మేనేజర్ మహేంద్ర ఆ పుకార్లను ఖండించేశాడు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చాడు. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.. అంటూ పుకార్లపై సామ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు. నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని క్లియర్‌గా చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దు అంటే సమంత మేనేజర్ మహేంద్ర అభిమానులకు సూచించాడు. సమంత ప్రస్తుతం క్షేమంగా ఉందని తెలిపాడు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నిన్న సమంత కడపలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ సమంతకు కరోనా సోకి ఉంటుందేమోనని అంతా అనుకున్నారు. అలా ఈ రూమర్లు మొదలైనట్టు తెలుస్తోంది. దానికి తోడు హాస్పిటల్‌లో టెస్టులు చేసుకున్నారనే సమాచారం కూడా రావడంతో ఇలా గాలి వార్తలు పుట్టించినట్టు కనిపిస్తోంది. మొత్తానికి సమంత ఆరోగ్యంపై వచ్చిన వార్తలు ఒక్కసారిగా అందరినీ ఆందోళనలోకి నెట్టేశాయి. అసలే సమంత ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పుష్పలోని ఐటం సాంగ్, అందులో సమంత వేసిన స్టెప్పులు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. ఊ అంటావా? ఉ ఊ అంటావా? అని అందరూ పాడేసుకుంటున్నారు. నిన్నటి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సమంత వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సమంత పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దూరంగానే ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GHZj7p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...