Saturday, 18 December 2021

ఓర్నీఇదెక్క‌డి చోద్యం.. ఐటెం సాంగ్‌ చేసిన స‌మంత‌కు పాలాభిషేక‌మా?

అదేంటో! కొన్ని వార్త‌లు వింటుంటే ఔనా ఇదెక్క‌డి చోద్యం అని అనుకోవాల్సిందే. ఇంత‌కీ ఇప్పుడు మ‌నం ఏ విష‌యం గురించి చెప్పుకోబోతున్నామో తెలుసా? స‌మంత గురించి. ఆమెకు ఏమైంది.. విడాకుల త‌ర్వాత ఆమె త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుందిగా అనుకోవ‌చ్చు. కానీ మ‌నం మాట్లాడుకోబోయే విష‌యం, స‌మంత రీసెంట్‌గా ది రైజ్ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌లో న‌టించిన సంగతి తెలిసిందే. ఆ పాట‌లో ఆమె హ‌ద్దుల‌ను దాటే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఊ అంటావ మావ ఉ ఉ అంటావా మావ‌.. అంటూ సాగిన ఈ సాంగ్ సినిమా విడుద‌ల‌కు ముందు వివాదాల‌కు కేంద్ర‌మైంది. ఈ పాట‌లో సాహిత్యం మ‌గ‌వారిని కించ‌ప‌రిచేలా ఉందంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ‌రావ‌తిలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన పురుషుల సంఘం ఈ పాట‌ను తొల‌గించాలంటూ కేసు వేసింది. స‌రే! మ‌నో భావాలు దెబ్బ తిన్న‌ప్పుడు ఫిర్యాదు చేయ‌డం, కేసు వేయ‌వ‌చ్చు. అంతా వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ఓ మ‌హిళా మండ‌లి స‌మంత‌కు, దేవిశ్రీ ప్ర‌సాద్‌కు అండ‌గా నిలిచింది. అమ‌రావ‌తిలోని తాళ్లూరు గ్రామంలోని కోదండ రామ ఆల‌యంలో స‌ద‌రు మ‌హిళా సంఘం పాటకు డాన్స్ చేసిన స‌మంత‌, పాట రాసిన చంద్ర‌బోస్ పేర్ల‌పై అర్చ‌న చేయ‌డ‌మే కాకుండా, వారి ఫొటోల‌కు పాలాభిషేకం చేశార‌ట‌. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో బ‌య‌ట‌కు రాలేదు కానీ.. వార్త‌లు మాత్రం నెట్టింట వ‌చ్చాయి. అయితే ఇదంతా సినిమా రిలీజ్ ముందే జ‌రిగింద‌ని కూడా స‌మాచారం. అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన పుష్ప ది రైజ్ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుక్కు కాంబోలో వచ్చిన మూడో చిత్రమిది. స‌మంత ఇందులో ఊ అంటావా మావ అనే స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది. సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహాన్ పాడిన ఈ పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా విడుద‌లైన తొలి రోజున పాన్ ఇండియా లెవల్లో రూ.71 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సినిమా సాధించిన‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పుష్ప పార్ట్ 2గా పుష్ప ది రూల్ సినిమా తెర‌కెక్క‌నుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FbpVNs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...