Thursday, 2 December 2021

ఆయనకు అభిమానినవ్వడం గర్వంగా ఉంది!.. ఎన్టీఆర్‌పై గృహలక్ష్మీ తులసి కామెంట్స్

అంటే కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాదు. మిగతా భాషల్లో ఎన్టీఆర్ సినిమాలను చేయకపోయినా కూడా ఫాలోయింగ్ మాత్రం హద్దులను చెరిపేస్తోంది. పక్క భాషల్లో నటించే సెలెబ్రిటీలకు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే మోజు ఉంటుంది. ఎంతో మంది సెలెబ్రిటీలకు ఎన్టీఆర్ హాట్ ఫేవరేట్. ఇక సీనియర్ హీరోయిన్లైన కుష్బూ, వనిత విజయ్ కుమార్ వంటి వారికి ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం ఉంటుంది. కుష్బూ అయితే బాహాటంగానే ఎన్టీఆర్ మీదున్న ప్రేమను బయటపెట్టేసింది. ఆయనతో ఒక్క సినిమాలో నటించే అవకాశం వచ్చినా చాలని కుష్బూ అంటే.. ఒక్క షాట్‌లో నటించినా పర్లేదు అని వనిత చెప్పుకొచ్చింది. తాజాగా ఫేమ్ ఎన్టీఆర్ మీద కామెంట్లు చేసింది. గృహలక్ష్మీ ధారావాహికలో తులసి పాత్రలో కస్తూరీ అందరినీ మెప్పిస్తోంది. కానీ తెరపై అమాయకంగా కనిపించే కస్తూరీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతుంటుంది. సోషల్ యాక్టివిస్ట్, లాయర్, అనలిస్ట్ ఇలా పలు రకాలుగా కస్తూరీ శంకర్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంటుంది. ప్రతీ ఒక్క అంశం మీద స్పందిస్తూ కస్తూరీ శంకర్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ మీద కస్తూరీ శంకర్ తన ప్రేమను చాటుకుంది. ఏపీలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వరదల దెబ్బకు ఏపీ అతలాకుతలమైంది. ప్రభుత్వానికి ఆర్థిక సాయాన్ని అందించేందుకు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ ముందడుగు వేశాడు. 25 లక్షల మొత్తానికి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించాడు. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటివారు విరాళాలు ఇచ్చారు. అలా ఎన్టీఆర్ ఈ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో కస్తూరీ శంకర్ ప్రశంసించింది. నీ అభిమానిని అయినందుకు గర్వంగా ఉందంటూ ట్వీట్ వేసింది. ప్రస్తుతం కస్తూరీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32GUrAv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...